థ్రిల్‌కి గురి చేసే స్కెచ్‌ | Super Sketch Press Meet Movie Launch | Sakshi
Sakshi News home page

థ్రిల్‌కి గురి చేసే స్కెచ్‌

May 11 2018 1:22 AM | Updated on May 11 2018 1:22 AM

Super Sketch Press Meet Movie Launch - Sakshi

రవి చావలి, ఇంద్ర, నర్శింగ్‌ మక్కల, అనిక

నర్సింగ్‌ మక్కల, ఇంద్ర, సమీర్‌ దత్త, కార్తీక్‌ రెడ్డి, చక్రి మాగంటి ముఖ్య తారలుగా రూపొందిన చిత్రం ‘సూపర్‌ స్కెచ్‌’. రవిచావలి దర్శకత్వంలో యు అండ్‌ ఐ బ్యానర్‌ సమర్పణలో బలరామ్‌ మక్కల, ఎ.పద్మనాభరెడ్డి నిర్మించారు. హైదరాబాద్‌లో జరిగిన ప్రెస్‌మీట్‌లో రవి చావలి మాట్లాడుతూ – ‘‘సస్పెన్స్‌ ఇన్వెస్టిగేటివ్‌ థ్రిల్లర్‌గా తెరకెక్కిన చిత్రమిది. ప్రతి నిమిషం చాలా ఆసక్తికరంగా ఉంటుంది. ప్రేక్షకులకు థ్రిల్‌ కలుగుతుంది.

ఈ చిత్రంలో తెలంగాణ యాసలో మాట్లాడే నర్సింగ్‌ మక్కల క్యారెక్టర్‌ సూపర్బ్‌గా ఉంటుంది. సురేంద్రగారు అద్భుతమైన విజువల్స్‌ ఇస్తే, కార్తీక్‌ మ్యూజిక్, నేపథ్య సంగీతంతో సినిమాను మరో లెవల్‌కు తీసుకెళ్లాడు’’ అన్నారు. ‘‘కథ వినగానే గ్రిప్పింగ్‌ స్క్రీన్‌ప్లే కుదిరితే బావుంటుందని అనుకున్నాం. స్క్రీన్‌ప్లే చాలా స్పీడ్‌గా ఉంటుంది. ఫైనల్‌ అవుట్‌పుట్‌ చూశాం. జూన్‌లో సినిమా రిలీజ్‌కు ప్లాన్‌ చేస్తున్నాం’’ అన్నారు నిర్మాతలు. ఇంద్ర, నర్సింగ్‌ మక్కల తదితరులు పాల్గొన్నారు.

Advertisement
 
Advertisement
Advertisement