సన్నీలియోన్.. పొట్టిగా, లావుగా ఉండేదట! | sunny leone was told she is too fat and short | Sakshi
Sakshi News home page

సన్నీలియోన్.. పొట్టిగా, లావుగా ఉండేదట!

Sep 12 2016 3:40 PM | Updated on Oct 17 2018 4:54 PM

సన్నీలియోన్.. పొట్టిగా, లావుగా ఉండేదట! - Sakshi

సన్నీలియోన్.. పొట్టిగా, లావుగా ఉండేదట!

'నువ్వు లావుగా.. పొట్టిగా ఉన్నావు, మోడలింగ్‌కు పనికిరావు' ఈ కామెంట్ ఎవరి గురించి వచ్చిందో తెలుసా.. బాలీవుడ్‌లో హీరోయిన్‌గా దాదాపు స్థిరపడిపోయిన సన్నీ లియోన్ గురించట!

'నువ్వు లావుగా.. పొట్టిగా ఉన్నావు, మోడలింగ్‌కు పనికిరావు' ఈ కామెంట్ ఎవరి గురించి వచ్చిందో తెలుసా.. బాలీవుడ్‌లో హీరోయిన్‌గా దాదాపు స్థిరపడిపోయిన సన్నీ లియోన్ గురించట! న్యూయార్క్ ఫ్యాషన్ వీక్‌లో ర్యాంప్ మీద నడిచిన మొట్టమొదటి బాలీవుడ్ నటిగా సన్నీలియోన్ పేరు సంపాదించింది. ఐశ్వర్యారాయ్ లాంటివాళ్లకు సైతం దక్కని అవకాశం సన్నీకి దక్కిందంటే చిన్నవిషయం కాదు. అలాంటి సన్నీ మొదట్లో, అంటే సుమారు 18 ఏళ్ల వయసు ఉన్నప్పుడు మోడలింగ్ కోసం ప్రయత్నిస్తే, ఆమెకు ఎదురైన సమాధానం అది. చిన్నప్పటి నుంచి తనకు మోడల్ అవ్వాలనే ఉండేదని, దాంతో 18 ఏళ్లు రాగానే తాను ప్రయత్నాలు మొదలుపెట్టానని సన్నీ లియోన్ చెప్పింది.

కానీ అప్పట్లో తనకు అన్నీ తిరస్కారాలే ఎదురయ్యాయని తెలిపింది. అలాంటి పొట్టి, లావు అమ్మాయి ఇప్పుడు న్యూయార్క్ ఫ్యాషన్ వీక్ ర్యాంప్‌ మీద నడిచిందని ఆమె ఆనందంగా వివరించింది. ర్యాంప్ మీద నడుస్తుంటే జారిపడిపోతానేమోనని భయం వేసిందని, అయితే అదృష్టం కొద్దీ అలాంటివేమీ జరగలేదని చెప్పింది. ఇదే ర్యాంపు మీద యాసిడ్ దాడి బాధితురాలు రేష్మా ఖురేషీ కూడా నడిచిన విషయం తెలిసిందే. రేష్మాను కలిసి ఆమెతో మాట్లాడానని, ఆమె అచ్చం ఒక బొమ్మలా ఉందని.. ఆమె ధైర్యం, పట్టుదల చూసి తాను చాలా ఆనందించానని తెలిపింది.

Advertisement

Related News By Category

Related News By Tags

Advertisement
 
Advertisement

పోల్

Advertisement