జేఎన్‌యూ హింసపై స్పందించిన సన్నీలియోన్‌

Sunny Leone Respond On JNU Violence - Sakshi

సాక్షి, న్యూఢిల్లీ : దేశ వ్యాప్తంగా సంచలనం సృష్టించిన ఢిల్లీలోని జేఎన్‌యూ హింసపై పలువురు సెలబ్రిటీలు తమ అభిప్రాయాన్ని వ్యక్తం చేస్తున్నారు. బాలీవుడ్‌ అగ్రతార దీపిక పదుకొనే జేఎన్‌యూను సందర్శించడంతో దీనిపై స్పందించే వారి సంఖ్య పెరుగుతోంది. వర్సిటీ విద్యార్థులపై దాడిని తీవ్రంగా ఖండించి, వారికి మద్దతుగా నిలుస్తున్నారు.  జేఎన్‌యూ హింసపై తాజాగా బాలీవుడ్‌ నటి సన్నీలియోన్‌ స్పందించారు. గురువారం ఆమె ఓ సమావేశంలో మాట్లాడుతూ.. ఈ దాడిని ఖండిస్తున్నట్లు ప్రకటించారు. (జేఎన్‌యూలో దీపిక)

‘నాకు తెలిసి అతిపెద్ద సమస్యపై నేను మాట్లాడుతున్నాను. హింసను ఎప్పుడూ సమర్థించలేను. దాడుల వల్ల బాధితురాలు మాత్రమే కాదు.. వారి కుటుంబం కూడా తీవ్ర క్షోభను అనుభవించాల్సి ఉంటుంది. ఇది వారి అభిప్రాయాలపై తీవ్ర ప్రభావం చూపే అవకాశం ఉంది. హింసకు చోటులేకుండా సమస్య పరిష్కారం కనుగొనాలి. ఎవరి మనోభావాలు దెబ్బతినకుండా సామరస్యపూర్వకంగా విభేదాలు పరిష్కరించుకోవాలి’ అని అన్నారు. కాగా యూనివర్సిటీ విద్యార్థి సంఘం(జేఎన్‌యూఎస్‌యూ) అధ్యక్షురాలు ఆయిషీ ఘోష్‌పై వర్సిటీలో ముసుగులు ధరించిన దుండుగులు విచ్చలవిడిగా దాడిచేసి పలువురు విద్యార్థులు, టీచర్లను తీవ్రంగా గాయపర్చిన విషయం తెలిసిందే. అనంతరం ఈ ఘటన దేశ రాజధానిలో పెను దుమారాన్నే రేపింది. రాజకీయ, సినీ ప్రముఖులు పరామర్శలు, ప్రకటనతో జేఎన్‌యూ రణరంగంగా మారింది.

Read latest Movies News and Telugu News | Follow us on FaceBook, Twitter, Telegram



 

Read also in:
Back to Top