సన్నీ కోసం ఇసుకేస్తే రాలనంత జనం | Sunny Leone feels Happy on trip to Kochi, know why? | Sakshi
Sakshi News home page

సన్నీ కోసం ఇసుకేస్తే రాలనంత జనం

Aug 18 2017 7:03 PM | Updated on Sep 12 2017 12:25 AM

బాలీవుడ్‌ బ్యూటీ సన్నీలియోన్‌కి యూత్‌లో ఉన్న క్రేజ్‌ గురించి ప్రత్యేకంగా చెప్పనక్కర్లేదు.



కొచ్చి:
బాలీవుడ్‌ బ్యూటీ సన్నీలియోన్‌కి యూత్‌లో ఉన్న క్రేజ్‌ గురించి ప్రత్యేకంగా చెప్పనక్కర్లేదు. తాజాగా సన్నీకి ఉన్న ఫ్యాన్‌ ఫాలోయింగ్‌ మరోసారి బయటపడింది. కేరళలో ఓ షోరూం ప్రారంభోత్సవ కార్యక్రమానికి సన్నీ హాజరయ్యారు. దీంతో సన్నీ చూసేందుకు ఆమె ఫ్యాన్స్‌ పెద్ద ఎత్తున తరలివచ్చారు. ఎంతమందో తెలుసా?. ఒక్కసారి సన్నీ షేర్‌ చేసిన వీడియో చూస్తే మీకే అర్థం అవుతుంది. ఇసుకేస్తే రాలనంత మంది అనీ..!. దీంతో ఆ షోరూం రూట్లో ట్రాఫిక్‌కి అంతరాయం కూడా కలిగింది.

తన కోసం అంతమంది ఫ్యాన్స్‌ రావడంపై సన్నీ ట్విటర్‌ ద్వారా స్పందించారు. కొచ్చి ప్రజలకు ధన్యవాదాలు చెప్పడానికి మాటలు సరిపోవన్నారు. కేరళను ఎప్పటికీ మర్చిపోనని ఆనందం వ్యక్తం చేశారు. పెద్ద సంఖ్యలో జనాలు ఉన్న ఫొటోను పోస్ట్‌ చేస్తూ.. ‘నా కారు నిజంగా కొచ్చిలోని ప్రేమ అనే సముద్రంలో ఉంది. కృతజ్ఞతలు’ అని మరో ట్వీట్‌లో ఆమె పేర్కొన్నారు. సన్నీ ప్రస్తుతం ‘బాద్‌షాహో’, ‘భూమి’ చిత్రాల్లోని ప్రత్యేక గీతాల్లో నటిస్తున్నారు.

Advertisement

Related News By Category

Related News By Tags

Advertisement
 
Advertisement

పోల్

Advertisement