హమ్మయ్య.. ఏమీ జరగలేదయ్యా

Sunny Leone falls sick, rushed to hospital - Sakshi

అర్ధరాత్రి హడావిడిగా ఆసుపత్రి తలుపు తట్టారు సన్నీ లియోన్‌. ఇది షూటింగ్‌ కోసం కాదు. నిజంగానే సన్నీ లియోన్‌ అస్వస్థతకు గురి అయ్యారు. అందుకే హాస్పిటల్‌కు వెళ్లారు. ఇంతకీ విషయం ఏంటంటే... ఓ చానల్‌ షోకు సంబంధించి ఉత్తరాఖాండ్‌లో ఉన్నారు సన్నీలియోన్‌. కానీ మిడ్‌నైట్‌ కడుపు నొప్పితో  బాధపడుతూ అక్కడే ఉన్న ఆసుపత్రిలో జాయిన్‌ అయ్యారు ఆమె. ‘‘మైల్డ్‌ ఫీవర్‌తో పాటు కడుపు నొప్పితో ఇబ్బందిపడుతూ సన్నీ లియోన్‌ హాస్పిటల్‌కు వచ్చారు.

చికిత్స తర్వాత ఆమె కోలుకున్నారు. శుక్రవారం డిస్‌చార్జ్‌ చేశాం’’ అని హాస్పిటల్‌ ప్రతినిధి ఒకరు పేర్కొన్నారు. ‘‘సన్నీ కాస్త అనారోగ్యానికి గురైన మాట వాస్తవమే. వైద్యులు బెడ్‌ రెస్ట్‌ సూచించారు. తిరిగి సోమవారం ఆమె సెట్‌లో జాయిన్‌ అవుతారని ఆశిస్తున్నాం. అప్పటివరకు సన్నీతో సంబంధంలేని సన్నివేశాలను చిత్రీకరిస్తాం’’ అని చిత్రబృందం పేర్కొంది. సో.. సన్నీ ఫ్యాన్స్‌ అందరూ ఆందోళన పడాల్సిన అవసరం ఏమీ లేదన్నమాట.

Read latest Movies News and Telugu News | Follow us on FaceBook, Twitter

Advertisement
Advertisement

*మీరు వ్యక్తం చేసే అభిప్రాయాలను ఎడిటోరియల్ టీమ్ పరిశీలిస్తుంది, *అసంబద్ధమైన, వ్యక్తిగతమైన, కించపరిచే రీతిలో ఉన్న కామెంట్స్ ప్రచురించలేం, *ఫేక్ ఐడీలతో పంపించే కామెంట్స్ తిరస్కరించబడతాయి, *వాస్తవమైన ఈమెయిల్ ఐడీలతో అభిప్రాయాలను వ్యక్తీకరించాలని మనవి

Back to Top