మామా అల్లుళ్ల సవాల్‌

Sumanth Idam Jagath Clash With Nagarjuna Devadas - Sakshi

కింగ్ నాగార్జున, యంగ్ హీరో నాని హీరోలుగా తెరకెక్కుతున్న క్రేజీ మల్టీస్టారర్‌ మూవీ దేవదాస్. వైజయంతీ మూవీస్‌ బ్యానర్‌పై నిర్మిస్తున్న ఈ సినిమాను యువ దర్శకుడు శ్రీరామ్‌ ఆదిత్య డైరెక్ట్ చేస్తున్నాడు. ఇప్పటికే షూటింగ్ పూర్తి చేసుకున్న ఈమూవీ ప్రస్తుతం నిర్మాణానంతర కార్యక్రమాలు జరుపుకుంటోంది. చాలా రోజుల క్రితమే దేవదాస్‌ యూనిట్‌ సినిమాను సెప్టెంబర్ 27న రిలీజ్ చేస్తున్నట్టుగా ప్రకటించారు.

అయితే తాజాగా అక్కినేని వారసుడు నాగార్జున మేనల్లుడు సుమంత్ మామాతో పోటికి సై అంటున్నాడు. మళ్ళీరావా సినిమాతో ఫాంలోకి వచ్చిన సుమంత్‌ ప్రస్తుతం క్రైమ్‌ థ్రిల్లర్‌గా తెరకెక్కుతున్న ఇదం జగత్ సినిమాలో నటిస్తున్నాడు. సుమంత్ తొలిసారిగా నెగెటివ్‌ షేడ్స్‌ఉన్న పాత్రలో నటిస్తున్న ఈ సినిమాను సెప్టెంబర్‌ 28 న రిలీజ్ చేస్తున్నట్టుగా ప్రకటించారు. దీంతో మామా అల్లుళ్ల మధ్య పోటి తప్పేలా లేదు. మరి ఈ మామా అల్లుళ్లు వెండితెర మీద బరిలో దిగుతారా లేక ఎవరైన పక్కకు తప్పుకుంటారా చూడాలి.

Advertisement
Advertisement

*మీరు వ్యక్తం చేసే అభిప్రాయాలను ఎడిటోరియల్ టీమ్ పరిశీలిస్తుంది, *అసంబద్ధమైన, వ్యక్తిగతమైన, కించపరిచే రీతిలో ఉన్న కామెంట్స్ ప్రచురించలేం, *ఫేక్ ఐడీలతో పంపించే కామెంట్స్ తిరస్కరించబడతాయి, *వాస్తవమైన ఈమెయిల్ ఐడీలతో అభిప్రాయాలను వ్యక్తీకరించాలని మనవి

Back to Top