మరో కథకు రైట్ రైట్ ! | Sumanth Ashwin Another story green signal | Sakshi
Sakshi News home page

మరో కథకు రైట్ రైట్ !

Jun 5 2016 1:49 AM | Updated on Jun 4 2019 6:34 PM

మరో కథకు రైట్ రైట్ ! - Sakshi

మరో కథకు రైట్ రైట్ !

‘రైట్ రైట్’ రిలీజ్ కోసం ఎదురు చూస్తున్న సుమంత్ అశ్విన్ మరో చిత్రానికి గ్రీన్‌సిగ్నల్ ఇచ్చారు.

‘రైట్ రైట్’ రిలీజ్ కోసం ఎదురు చూస్తున్న సుమంత్ అశ్విన్ మరో చిత్రానికి గ్రీన్‌సిగ్నల్ ఇచ్చారు. నితిన్ నటించిన ‘ద్రోణ’ చిత్రాన్ని తెరకెక్కించిన కరుణకుమార్ దర్శకత్వంలో ఈ చిత్రం రూపొందనుంది. ‘సూర్య వెర్సస్ సూర్య’, ‘శౌర్య’ చిత్రాలను నిర్మించిన మల్కాపురం శివకుమార్ ఈ చిత్రాన్ని నిర్మించనున్నారు.  నిర్మాత మాట్లాడుతూ- ‘‘సుమంత్ అశ్విన్‌తో సరికొత్త కథాకథనాలతో ఈ చిత్రాన్ని రూపొందించబోతున్నాం. సుమంత్ కెరీర్‌లో మరో మంచి చిత్రంగా నిలిచిపోతుంది. వచ్చే నెలలో ఈ చిత్రాన్ని ప్రారంభిస్తాం’’ అని చెప్పారు.

Advertisement
 
Advertisement
Advertisement