ఫ్లాప్‌ ఇచ్చిన దర్శకుడితో మహేష్‌

Sukumar Next with Mahesh Babu - Sakshi

ప్రస్తుతం క్రియేటివ్ డైరెక్టర్‌ సుకుమార్, రామ్ చరణ్‌ హీరోగా రంగస్థలం సినిమాను తెరకెక్కిస్తున్న సంగతి తెలిసిందే. ఇప్పటికే మేజర్ పార్ట్‌ షూటింగ్ పూర్తి చేసుకున్న ఈ సినిమాను మార్చి 30న రిలీజ్ చేయనున్నారు. ఈ సినిమా తరువాత సుకుమార్ ఓ క్రేజీ ప్రాజెక్ట్‌కు రెడీ అవుతున్నాడన్న ప్రచారం జరుగుతోంది.

సూపర్ స్టార్ మహేష్ బాబు హీరోగా వన్ నేనొక్కడినే సినిమాను తెరకెక్కించిన సుకుమార్ మరోసారి మహేష్ హీరోగా ఓ సినిమా చేసే ఆలోచనలో ఉన్నాడట. ఇప్పటికే మహేష్‌కు ఓ లైన్ వినిపించి ఓకె చేయించుకున్నాడన్న టాక్ వినిపిస్తోంది. రంగస్థలం రిలీజ్ అయిన వెంటనే మహేష్ తో చేయబోయే సినిమా పనులు ప్రారంభించనున్నాడు సుకుమార్.

ప్రస్తుతం మహేష్ బాబు, కొరటాల శివ దర్శకత్వంలో భరత్‌ అనే నేను సినిమాలో నటిస్తున్నాడు. పొలిటికల్‌ థ్రిల్లర్‌గా తెరకెక్కుతున్న ఈ సినిమా తరువాత వంశీ పైడిపల్లి దర్శకత్వంలో ఓ సినిమా చేయనున్నాడు. సుకుమార్ సినిమా ఓకె అయితే ఈ రెండు సినిమాల తరువాత మరోసారి వన్ కాంబినేషన్‌ రిపీట్ అయ్యే అవకాశం ఉంది.

Advertisement
Advertisement

*మీరు వ్యక్తం చేసే అభిప్రాయాలను ఎడిటోరియల్ టీమ్ పరిశీలిస్తుంది, *అసంబద్ధమైన, వ్యక్తిగతమైన, కించపరిచే రీతిలో ఉన్న కామెంట్స్ ప్రచురించలేం, *ఫేక్ ఐడీలతో పంపించే కామెంట్స్ తిరస్కరించబడతాయి, *వాస్తవమైన ఈమెయిల్ ఐడీలతో అభిప్రాయాలను వ్యక్తీకరించాలని మనవి

Back to Top