‘దొరసాని’లో నిజాయితీ ఆకట్టుకుంటుంది : సుకుమార్ | Sukumar At Dorasani Trailer Launch | Sakshi
Sakshi News home page

‘దొరసాని’లో నిజాయితీ ఆకట్టుకుంటుంది : సుకుమార్

Jul 1 2019 4:26 PM | Updated on Jul 7 2019 11:45 AM

Sukumar At Dorasani Trailer Launch - Sakshi

ఆనంద్‌ దేవరకొండ, శివాత్మిక రాజశేఖర్‌ వెండితెరకు పరిచయమవుతూ చేస్తున్న చిత్రమే దొరసాని. టీజర్‌తోనే మంచి హైప్‌ను క్రియేట్‌ చేసిన దొరసాని.. పాటలతో మంచి టాక్‌ను సొంతం చేసుకుంది. తాజాగా విడుదల చేసిన ట్రైలర్‌.. అంచనాలను రెట్టింపు చేసింది. ఈ ట్రైలన్‌ను టాలెంటెడ్‌ డైరెక్టర్‌ సుకుమార్‌ రిలీజ్‌ చేశారు. 

ఈ కార్యక్రమంలో సుకుమార్‌ మాట్లాడుతూ.. ‘నిషీధి అనే  షార్ట్ ఫిల్మ్ చేసి శ్యాంబెనగల్ నుండి ప్రశంసలు పొందారు దర్శకుడు కె.వి.ఆర్. మహేంద్ర. దర్శకుడిగా అతని అభిరుచేంటో ట్రైలర్ చెబుతుంది. విజువల్స్, బ్యాక్ గ్రౌండ్ స్కోర్ చాలా  బాగున్నాయి. ఇప్పుడు తెలుగు సినిమా తీరు మారింది. నిజాయితీ నిండిన కథలే ప్రేక్షకులు మనసు గెలుచుకుంటున్నాయి. కొత్త దర్శకులు చాలా మంచి సినిమాలతో వస్తున్నారు. దొరసానిలో పాటలు రోజూ వింటున్నాను. ‘నింగిలోన పాలపుంత నవ్వులొంపెనే ’ పాట నన్ను హంట్ చేస్తుంది. గోరెటి వెంకన్న సాహిత్యానికి నేను పెద్ద అభిమానిని. దొరసాని లో అంతా నిజాయితీనే కనిపిస్తుంది. శివాత్మిక పర్‌ఫెక్ట్ తెలంగాణ అమ్మాయిలా కనపడుతుంది.  చూస్తుంటే చాలా ఆనందంగా ఉంది. ఆమె స్ర్కీన్ ప్రజెన్స్ బాగుంది. విజయ దేవరకొండలో కనిపించిన నిజాయితీ.. వాళ్ల తమ్ముడు ఆనంద్ దేవరకొండ మాటల్లో కూడా కనిపించింది. సినిమా పెద్ద విజయం సాధించాలని కొరుకుంటున్నాన’ని అన్నారు. ఈ చిత్రం జూలై 12న ప్రేక్షకుల ముందుకు రాబోతోంది.

Advertisement

Related News By Category

Related News By Tags

Advertisement
 
Advertisement

పోల్

Advertisement