‘నన్ను దోచుకుందువటే’ ఫస్ట్ లుక్‌ | Sudheer Babu Nannu Dochukunduvate First Look | Sakshi
Sakshi News home page

Jun 29 2018 11:27 AM | Updated on Jun 29 2018 11:27 AM

Sudheer Babu Nannu Dochukunduvate First Look - Sakshi

సమ్మోహనం సినిమాతో సూపర్‌ హిట్ అందుకున్న యంగ్ హీరో సుధీర్ బాబు మరో ఆసక్తికర చిత్రంతో ప్రేక్షకుల ముందుకు వచ్చేందుకు రెడీ అవుతున్నాడు. ఆర్‌ఎస్‌ నాయుడు దర్శకత్వంలో తెరకెక్కుతున్న కొత్త సినిమాకు ‘నన్ను దోచుకుందువటే’ అనే టైటిల్‌ను ఫిక్స్‌ చేశారు. సీనియర్‌ ఎన్టీఆర్ హీరోగా తెరకెక్కిన గులేభకావళి కథ చిత్రంలోని సూపర్‌ హిట్ పాట పల్లవినే ఈ సినిమాకు టైటిల్‌గా ఫిక్స్‌ చేశారు.

ఈ సినిమాను సుధీర్‌ బాబు స్వయంగా తన సొంత నిర్మాణ సంస్థ సుధీర్‌ బాబు ప్రొడక్షన్స్ బ్యానర్‌పై నిర్మిస్తున్నారు. సుధీర్‌ సరసన నభా నటేష్‌ హీరోయిన్‌గా నటిస్తున్న ఈ సినిమాకు అజనీష్‌ బి లోకనాథ్‌ సంగీతమందిస్తున్నారు. ఈ సినిమా ఫస్ట్ లుక్‌పోస్టర్‌ను సుధీర్‌ తన సోషల్‌ మీడియా పేజ్‌ ద్వారా రిలీజ్ చేశారు.

Advertisement
 
Advertisement
Advertisement