వైజాగ్‌లో సుధాకర్ హంగామా! | Sudhakar Komakula to cast as hero in new movie | Sakshi
Sakshi News home page

వైజాగ్‌లో సుధాకర్ హంగామా!

Oct 12 2013 1:15 AM | Updated on Aug 28 2018 4:30 PM

వైజాగ్‌లో సుధాకర్ హంగామా! - Sakshi

వైజాగ్‌లో సుధాకర్ హంగామా!

‘లైఫ్ ఈజ్ బ్యూటిఫుల్’ సినిమాలో తళుక్కున మెరిసి ఆకట్టుకున్న సుధాకర్ కొమకుల వైజాగ్‌లో హంగామా చేస్తున్నారు. ఆయన హీరోగా ఆమ్ ఆద్మీ పిక్చర్స్ సంస్థ నిర్మిస్తున్న చిత్రం పూజా కార్యక్రమాలు శుక్రవారం వైజాగ్‌లో జరిగాయి.

‘లైఫ్ ఈజ్ బ్యూటిఫుల్’ సినిమాలో తళుక్కున మెరిసి ఆకట్టుకున్న సుధాకర్ కొమకుల వైజాగ్‌లో హంగామా చేస్తున్నారు. ఆయన హీరోగా ఆమ్ ఆద్మీ పిక్చర్స్ సంస్థ నిర్మిస్తున్న చిత్రం పూజా కార్యక్రమాలు శుక్రవారం వైజాగ్‌లో జరిగాయి. ప్రసిద్ధ నట శిక్షకుడు సత్యానంద్ ముఖ్య అతిథిగా పాల్గొన్నారు. 
 
 రవిబాబు దగ్గర దర్శకత్వ శాఖలో పనిచేసిన అరుణ్ దాస్యం దర్శకునిగా పరిచయమవుతున్నారు. సీనియర్ తారలు రాధిక, నరేష్, పూర్ణిమ ఇందులో కీలక పాత్రలు పోషిస్తున్నారు. దర్శకుడు అరుణ్ దాస్యం మాట్లాడుతూ -‘‘ఈ నెల 17 నుంచి వైజాగ్‌లో ఏకధాటిగా చిత్రీకరణ చేయబోతున్నాం. 
 
 ప్రేమ, కుటుంబ బంధాలు, క్రీడలు, సంగీతం... ఈ నాలుగు అంశాల నేపథ్యంలో సాగే కథ ఇది. కథనం వినూత్నంగా ఉంటుంది. సుధాకర్ పాత్ర చిత్రణ నవ్యరీతిలో ఉంటుంది’’ అని తెలిపారు. కార్తీక్ స్పెషల్ రోల్ పోషించనున్న ఈ చిత్రానికి సంగీతం: రామ్‌నారాయణ్, నిర్మాణం: ఆమ్ టీమ్.
 

Advertisement

Related News By Category

Related News By Tags

Advertisement
 
Advertisement

పోల్

Advertisement