ఎలక్షన్‌లోనూ కలెక్షన్స్‌ బాగున్నాయి

Subramaniapuram Movie Success Meet - Sakshi

సుమంత్‌

‘‘తెలంగాణ రాష్ట్రంలో శుక్రవారం అసెంబ్లీ ఎన్నికలు ఉన్నా మా ‘సుబ్రహ్మణ్యపురం’ సినిమా మంచి కలెక్షన్స్‌ సాధించింది. సినిమా రిలీజ్‌ నుంచి మంచి రిపోర్ట్స్‌ వింటున్నాను. డిస్ట్రిబ్యూటర్స్‌తో మాట్లాడినప్పుడు  చాలా మంచి టాక్‌ వచ్చిందని చెప్పడంతో సంతోషంగా ఉంది. దర్శకుడు సంతోష్‌లాగా ఎవరైనా మంచి కథతో వస్తే ఏ జానర్‌లో అయినా సినిమా చేయడానికి రెడీ’’ అని సుమంత్‌ అన్నారు. సంతోష్‌ జాగర్లపూడి దర్శకత్వంలో సుమంత్, ఈషా రెబ్బా జంటగా తెరకెక్కిన చిత్రం ‘సుబ్రహ్మణ్యపురం’.

బీరం సుధాకర్‌ రెడ్డి నిర్మించిన ఈ సినిమా గత శుక్రవారం విడుదలైంది. సంతోష్‌ జాగర్లపూడి మాట్లాడుతూ– ‘‘కథను నమ్మి అవకాశం ఇచ్చిన బీరం సుధాకర్‌ రెడ్డిగారికి, సుమంత్‌గారికి థ్యాంక్స్‌. అమెరికా నుంచి నా ఫ్రెండ్స్‌ కాల్‌ చేసి సినిమా బావుందన్నారు. డిస్ట్రిబ్యూటర్స్, ముఖ్యంగా నిర్మాత చాలా సంతోషంగా ఉన్నారు. సినిమాలో సెకండ్‌ హాఫ్‌కి మంచి ప్రశంసలు వస్తున్నాయి’’ అన్నారు. ‘‘ఉదయం ఆట నుంచే మా సినిమా హౌస్‌ఫుల్‌ కలెక్షన్లు సాధించడంతో చాలా సంతోషంగా ఉన్నాను. మేం అనుకున్న విజయాన్ని అందించిన ప్రేక్షకులకు కృతజ్ఞతలు. ఈ విజయానికి సహకరించిన సుమంత్‌గారికి, సాంకేతిక నిపుణులకు ధన్యవాదాలు’’ అన్నారు బీరం సుధాకర్‌ రెడ్డి.

Advertisement
Advertisement

*మీరు వ్యక్తం చేసే అభిప్రాయాలను ఎడిటోరియల్ టీమ్ పరిశీలిస్తుంది, *అసంబద్ధమైన, వ్యక్తిగతమైన, కించపరిచే రీతిలో ఉన్న కామెంట్స్ ప్రచురించలేం, *ఫేక్ ఐడీలతో పంపించే కామెంట్స్ తిరస్కరించబడతాయి, *వాస్తవమైన ఈమెయిల్ ఐడీలతో అభిప్రాయాలను వ్యక్తీకరించాలని మనవి

Back to Top