‘బ్రహ్మోత్సవం’కథ ఇదేనా? | Storyline of Brahmotsavam | Sakshi
Sakshi News home page

‘బ్రహ్మోత్సవం’కథ ఇదేనా?

Jun 30 2015 10:43 PM | Updated on Oct 30 2018 5:58 PM

‘బ్రహ్మోత్సవం’కథ ఇదేనా? - Sakshi

‘బ్రహ్మోత్సవం’కథ ఇదేనా?

రెగ్యులర్ షూటింగ్ మొదలవ్వలేదన్న మాటే కానీ... శ్రీకాంత్ అడ్డాల దర్శకత్వంలో మహేశ్‌బాబు నటిస్తున్న ‘బ్రహ్మోత్సవం’ సినిమాపై ఇప్పటికే బోలెడంత ప్రచారం

 రెగ్యులర్ షూటింగ్ మొదలవ్వలేదన్న మాటే కానీ... శ్రీకాంత్ అడ్డాల దర్శకత్వంలో మహేశ్‌బాబు నటిస్తున్న ‘బ్రహ్మోత్సవం’ సినిమాపై ఇప్పటికే బోలెడంత ప్రచారం సాగుతోంది. గతంలో ‘సీతమ్మ వాకిట్లో సిరిమల్లె చెట్టు’ లాంటి ఫ్యామిలీ కథాంశంతో ఆకట్టుకున్న ఈ దర్శక, హీరోల ద్వయం ఈసారి ‘బ్రహ్మోత్సవం’లో కూడా కుటుంబ విలువలకే పట్టం కడుతున్నారు. ఈ చిత్ర కథ అంటూ కృష్ణానగర్‌లో ఒక గాలి కబురు ప్రచారమవుతోంది. కథానుసారం ముగ్గురు హీరోయిన్లు (సమంత, కాజల్ అగర్వాల్, ప్రణీత). హీరో ఆ పాత్రల సాయంతో కుటుంబం విలువను తెలుసుకుంటాడట!  హీరోకూ, అతని తండ్రి పాత్ర (సత్యరాజ్)కూ మధ్య అనుబంధం ప్రధానంగా సాగే ఈ కథ హీరో తల్లి (రేవతి) కుటుంబం చుట్టూ తిరుగుతుందట! ఈ కథలోని నిజానిజాల మాట దర్శక, నిర్మాతలకే తెలియాలి. కుటుంబ విలువలు, మన సంస్కృతికి పెద్దపీట వేసే శ్రీకాంత్ అడ్డాల ఈసారి ‘బ్రహ్మోత్సవం’లోనూ ఆ బాటలో వెళతానని ముందే ప్రకటించారు. అంటే, వచ్చే సంక్రాంతికి ఈ సినిమా రూపంలో మరో ఘన విజయానికి రంగం సిద్ధమైనట్లే కనిపిస్తోంది.
 

Advertisement
Advertisement
 
Advertisement
Advertisement