కరోనా : విజయ్‌ భారీ విరాళం.. | Star Hero Vijay Donates Rs.1.3 Crore To Combat Coronavirus | Sakshi
Sakshi News home page

కరోనా : విజయ్‌ భారీ విరాళం..

Apr 22 2020 2:47 PM | Updated on Apr 22 2020 3:21 PM

Star Hero Vijay Donates Rs.1.3 Crore To Combat Coronavirus - Sakshi

కరోనా నియంత్రణ చర్యలు చేపడుతున్న ప్రభుత్వాలకు అండగా నిలిచేందుకు పలువురు సినీ ప్రముఖులు తమ వంతు సాయంగా విరాళాలు ప్రకటిస్తున్న సంగతి తెలిసిందే. తాజాగా తమిళ స్టార్‌ హీరో విజయ్‌ కూడా కరోనా నియంత్రణ చర్యలకు భారీ విరాళం ప్రకటించారు. మొత్తం రూ. 1.3 కోట్ల విరాళం అందజేయనున్నట్టు తెలిపారు. ఇందులో ప్రధాని సహాయ నిధికి రూ. 25 లక్షలు, తమిళనాడు ముఖ్యమంత్రి సహాయ నిధికి రూ. 50 లక్షలు, దక్షిణాది సినీ కార్మికుల ఫెడరేషన్‌కు(ఫెఫ్సీ) రూ. 25 లక్షలు, కేరళ ముఖ్యమంత్రి సహాయ నిధికి రూ. 10 లక్షలు, తెలంగాణ, ఆంధ్రప్రదేశ్‌, కర్ణాటక, పుదుచ్చేరి ముఖ్యమంత్రుల సహాయ నిధికి రూ. 5 లక్షల చొప్పున అందజేయనున్నారు. 

తమిళ స్టార్‌ హీరో అయిన విజయ్‌కు దక్షిణాదిన మంచి ఫాలోయింగ్‌ ఉన్న సంగతి తెలిసిందే. ఈ నేపథ్యంలో దక్షిణాదిలో ఉన్న అన్ని రాష్ట్రాల సీఎంల సహాయ నిధికి విరాళాలు అందజేసినట్టుగా తెలుస్తోంది. కాగా, ప్రస్తుతం విజయ్‌ కుమారుడు జాన్సన్‌ సంజయ్‌ కెనడాలో చిక్కుపోయినట్టుగా తెలుస్తోంది. దీంతో విజయ్‌ తన కుమారుడి పరిస్థితిపై ఆందోళనతో ఉన్నట్టుగా వార్తలు వస్తున్నాయి.

చదవండి : కరోనా.. కొడుకు గురించి హీరో విజయ్‌ ఆందోళన!

Advertisement

Related News By Category

Related News By Tags

Advertisement
 
Advertisement

పోల్

Advertisement