మాధురీకి..‌ భర్త ప్రత్యేక బర్త్‌డే విషేష్ | Sriram Nene Wish To Madhuri Dixit She Is My Soulmate | Sakshi
Sakshi News home page

మాధురీకి..‌ భర్త ప్రత్యేక బర్త్‌డే విషేష్

May 16 2020 11:52 AM | Updated on May 16 2020 1:42 PM

Sriram Nene Wish To Madhuri Dixit She Is My Soulmate - Sakshi

బాలీవుడ్‌ నటి మాధురీ దీక్షిత్ తన అద్భుతమైన డాన్స్‌, నటనతో ‘డ్యాన్సింగ్ క్వీన్’ ‌గా గుర్తింపు పొందిన విషయం తెలిసిందే. మాధురీ ఎప్పుడూ సోషల్‌ మీడియాలో యాక్టివ్‌ ఉంటూ తను చేసిన డాన్స్‌ వీడియోను పోస్టు చేస్తూ అభిమానులను అలరిస్తారు. ఆమె మే15 (శుక్రవారం) 53వ వసంతంలోకి అడుగుపెట్టారు. ఈ సందర్భంగా పలువురు బాలీవుడ్‌​ ప్రముఖులు మాధురీకి బర్త్‌డే విషెష్ తెలిపారు. ఆమె భర్త శ్రీరాం మాధ‌వ్ నేనే.. మధురీకి బర్త్‌డే విషెష్‌ తెలుపుతూ వారిద్దరు కలిసి ఉన్న ఓ ఫొటోను తన ట్విటర్‌ ఖాతాలో పోస్ట్‌ చేశారు. ’ మనం చాలా అద్భుతమైన జీవన ప్రయాణాన్ని సాగిస్తున్నాం. చాలా తెలివైన నా అర్ధాంగి, నా అత్మబంధువు. నీకు పుట్టిన రోజు శుభాకాంక్షలు’  అంటూ ఆయన కామెంట్‌ జత చేశారు.

ఇక బర్త్‌డే సందర్భంగా మాధురీ దీక్షిత్‌ తన ‘క్యాండిల్‌’ సాంగ్‌  ప్రివ్యూను ట్వీటర్‌లో పోస్టు  చేశారు. ‘బర్త్‌ డే విషెష్‌ తెలిపిన అందరికి కృతజ్ఞతలు. మీ ప్రేమకు ధన్యవాదాలు. క్యాడిల్‌ పాట ప్రివ్యూ చూడండి. క్యాండిల్‌ అంటే నమ్మకానికి సంకేతం. ప్రస్తుతం మనందిరికీ అది ఎంతో అవసరం’ అంటూ కామెంట్‌ జతచేశారు. మాధురీ దీక్షిత్, శ్రీరాం మాధ‌వ్ నేనే 1999లో వివాహం చేసుకొని ఒకటయ్యారు. వీరికి  అరిన్‌, రాయన్ అనే ఇద్దరు అబ్బాయిలు ఉన్నారు. లాక్‌డౌన్‌లో నేపథ్యంలో ప్రస్తుతం మాధురీ దీక్షిత్‌ ముంబైలోని తన ఇంటికే పరిమితమై కుంబుంబంతో గడుపుతున్నారు. సినిమాల విషయానికి వస్తే.. మాధురీ చివరగా ‘కలంక్’‌ చిత్రంలో కనిపించారు. 

Advertisement

Related News By Category

Related News By Tags

Advertisement
 
Advertisement

పోల్

Advertisement