బాయ్ ఫ్రెండ్ తో కెమెరా కంటికి జాన్వి | Sridevi's daughter Jhanvi Kapoor seen kissing boyfriend and internet is losing it | Sakshi
Sakshi News home page

బాయ్ ఫ్రెండ్ తో కెమెరా కంటికి జాన్వి

Aug 2 2016 6:31 PM | Updated on Oct 22 2018 6:02 PM

బాయ్ ఫ్రెండ్ తో కెమెరా కంటికి జాన్వి - Sakshi

బాయ్ ఫ్రెండ్ తో కెమెరా కంటికి జాన్వి

స్టార్ హీరో మహేష్, టాప్ డైరెక్టర్ మురుగదాస్ సినిమాకు నో చెప్పి అందరినీ ఆశ్చర్యపరచిన శ్రీదేవి తనయ జాన్వి ఇప్పుడు 'ముద్దు'తో మరోసారి వార్తల్లోకెక్కింది.

స్టార్ హీరో మహేష్, టాప్ డైరెక్టర్ మురుగదాస్ సినిమాకు నో చెప్పి అందరినీ ఆశ్చర్యపరచిన శ్రీదేవి తనయ జాన్వి.. ఇప్పుడు 'ముద్దు'తో మరోసారి వార్తల్లోకెక్కింది. 16 ఏళ్ల జాన్వి తన బాయ్ ఫ్రెండ్ శిఖర్ పహారియాతో 'లిప్ లాక్'లో తన్మయత్వంగా ఉన్న ఫొటోలు సోషల్ మీడియాలో హల్ చల్ చేస్తున్నాయి. ఓ పార్టీలో పాల్గొన్న వీళ్లిద్దరూ ముద్దుల్లో మునిగి తేలుతుండగా కెమెరా కంటికి చిక్కారట.

శిఖ‌ర్ ప‌హారియా మాజీ కేంద్ర మంత్రి సుశీల్ కుమార్ షిండే మ‌న‌వ‌డు. బాలీవుడ్ స్టార్ హీరో సైఫ్ అలీఖాన్ కూతురు సారా డేటింగ్ చేస్తున్న వీర్ పహారియా సోదరుడే శిఖ‌ర్ ప‌హారియా. జాన్వి ప్రస్తుతం లాస్ ఏంజిల్స్లోని ఓ ప్రముఖ ఫిల్మ్ ఇన్స్టిట్యూట్లో నటనలో శిక్షణ తీసుకుంటోంది. సినిమాల్లో నటించేందుకు ఇంకా తాను సిద్ధమవ్వాల్సి ఉందంటూ క్రేజీ ఆఫర్ను జాన్వి తిరస్కరించిన విషయం తెలిసిందే. బాయ్ ఫ్రెండ్తో బయటపడ్డ అమ్మడి ఫొటోలు రకరకాల కామెంట్లతో సోషల్ మీడియాలో వైరల్ అవుతున్నాయి. (చదవండి: బాయ్ఫ్రెండ్తో హీరో కూతురు మళ్లీ!)

Advertisement

Related News By Category

Related News By Tags

Advertisement
 
Advertisement

పోల్

Advertisement