మెగా హీరో నుంచి నాకు బెదిరింపు కాల్‌ : శ్రీరెడ్డి | Sri Reddy Tweets On Nagababu | Sakshi
Sakshi News home page

మెగా హీరో నుంచి నాకు ఫోన్‌ కాల్‌ : శ్రీరెడ్డి

Apr 22 2018 3:53 PM | Updated on Apr 22 2018 4:07 PM

Sri Reddy Tweets On Nagababu - Sakshi

శ్రీరెడ్డి(ఫైల్‌ ఫోటో)

సాక్షి, హైదరాబాద్‌: కాస్టింగ్‌ కౌచ్‌ పేరిట తెలుగు చిత్రసీమలో మహిళలను లైంగికంగా దోపిడి చేస్తున్నారంటూ గళమెత్తి నటి శ్రీరెడ్డి సంచలనం సృష్టించిన సంగతి తెలిసిందే. అయితే శ్రీరెడ్డి మరో సంచలనానికి తెరలేపింది. ఇటీవల  జనసేన అధినేత పవన్‌ కల్యాణ్‌పై శ్రీ రెడ్డి సంచలన ఆరోపణలు చేశారు. ఆ ఘటన తరువాత తనకు బెదిరింపు కాల్స్ వస్తున్నాయంటూ ఆమె ఆరోపించింది. 

ముఖ్యంగా మెగా హీరో నాగబాబు తనకు కాల్ చేసి బెదిరింపులకు పాల్పడుతన్నారంటూ ట్విటర్ వేదికగా శ్రీరెడ్డి తెలిపారు. ‘నాకు చాలా బెదిరింపు కాల్స్ వస్తున్నాయి. ముఖ్యంగా మెగా ఫ్యామిలీలో నాగబాబు దగ్గర నుంచి, నాకు ఏమైనా జరిగితే దానికి పూర్తి బాధ్యత మెగా ఫ్యామిలీదే. ఇది స్వయంగా నా స్వహస్తాలతో రాస్తున్న నా వాంగ్మూలం’’ అంటూ ట్విటర్‌లో పేర్కొన్నారు.

అదేవిదంగా ‘అయ్యా పవన్ కళ్యాణ్ గారు ఎందుకండి ఒకే వీడియోని ఐదు, ఆరు సార్లు ట్విట్ చేస్తున్నారు. ఎవరెవరో ఫొటోస్ ట్విట్ చేస్తున్నారు. మీరు ట్వీట్ చేసిన ఫొటోలలో ఉన్న వారి మీద దాడి చేయండి అని మీ అభిమానులని ఉసిగోల్పుతున్నట్లుంది. పాపం మీ ఫాన్స్ ని మీరు అమాయకులను చేసి ఆడుకుంటున్నారు’ అని మరో ట్వీట్‌ చేశారు. 

Advertisement

Related News By Category

Related News By Tags

Advertisement
 
Advertisement

పోల్

Advertisement