సినిమా రంగంలో శ్రీశాంత్ | Sreeshanth in film industry | Sakshi
Sakshi News home page

సినిమా రంగంలో శ్రీశాంత్

May 12 2014 11:25 PM | Updated on Sep 2 2017 7:16 AM

సినిమా రంగంలో శ్రీశాంత్

సినిమా రంగంలో శ్రీశాంత్

క్రికెట్ క్రీడాకారుడు శ్రీశాంత్ గురించి తెలియని వారుండరు. కొంత కాలం స్టార్ ప్టేయర్‌గా మెరిసిన ఈయన ఆ మధ్య బెట్టింగ్ ఆరోపణలతో బహిష్కరణకు గురై విషయం తెలిసిందే.

క్రికెట్ క్రీడాకారుడు శ్రీశాంత్ గురించి తెలియని వారుండరు. కొంత కాలం స్టార్ ప్టేయర్‌గా మెరిసిన ఈయన ఆ మధ్య బెట్టింగ్ ఆరోపణలతో బహిష్కరణకు గురై విషయం తెలిసిందే. ఈ సంచలన క్రీడాకారుడిప్పుడు తన దృష్టిని సినిమా రంగంపై సారించారు. ఈ రంగంలో నటుడిగా, సంగీత దర్శకుడిగా తన ప్రతిభను చాటుకోనున్నారు. తమిళం, తెలుగు భాషల్లో రూపొందనున్న అన్బుళ్ల అళగే అనే చిత్రానికి సంగీతాన్ని అందించడంతోపాటు ఒక ముఖ్య పాత్రలో నటించనున్నారు. అంతేకాదు శ్రీశాంత్ రియాలిటీ షో కోసం ప్రాక్టీస్ చేస్తుండడం విశేషం. ప్రముఖ డ్యాన్సర్, నృత్య దర్శకురాలు స్నేహా కపూర్ ఈ షోకు నృత్య దర్శకత్వ బాధ్యతలను నిర్వహించనున్నారని శ్రీశాంత్ సోదరుడు నిర్వాహకుడు దీపుశాంత్ వెల్లడించారు. శ్రీశాంత్ ఇప్పటికే ఒక స్టేజీ ప్రోగ్రామ్‌లో బాలీవుడ్ సూపర్‌స్టార్ షారుఖ్‌ఖాన్‌తో కలిసి ఆడి తన డ్యాన్స్ స్కిల్‌ను నిరూపించుకున్నారు. ఈ రియాలిటీ షోకు క్రికెట్ క్రీడాకారులు పురబ్ కోహ్లి, సుబే విందర్ సింగ్, సోపియ చౌదరి, నటుడు రణ్‌వీర్ షోర్‌లు అతిథులుగా పాల్గొననున్నారు. ఈ షోకు నటి మాధురి దీక్షిత్, కరణ్ జోహార్, రెమో డి.సౌజాలు న్యాయనిర్ణేతలుగా వ్యవహరించనుండటం విశేషం.

Advertisement

Related News By Category

Advertisement
 
Advertisement
Advertisement