వినోదం.. వినూత్నం

Sree Vishnu New Movie Launched, Directed By Hasith Goli - Sakshi

వైవిధ్యంతో కూడిన కథలను ఎంచుకుంటూ హీరోగా సినిమాలు చేస్తుంటారు శ్రీవిష్ణు. తాజాగా మరో విభిన్న కథలో హీరోగా నటించబోతున్నారు. శ్రీవిష్ణు హీరోగా నటించిన ‘మెంటల్‌ మదిలో, బ్రోచేవారెవరురా’ చిత్రాలకు దర్శకత్వ శాఖలో పని చేసిన హాసిత్‌ గోలి ఈ సినిమాతో దర్శకునిగా పరిచయం కానున్నారు. టీజీ విశ్వప్రసాద్, అభిషేక్‌ అగర్వాల్‌ ఈ సినిమాను నిర్మించనున్నారు. వివేక్‌ కూచిభొట్ల, కీర్తీ చౌదరి సహ–నిర్మాతలు. ‘‘వినూత్నమైన కథతో వినోదభరితంగా ఈ చిత్రం తెరకెక్కనుంది. జనవరిలో చిత్రీకరణ మొదలుపెడతాం. ఈ సినిమాకు వివేక్‌ సాగర్‌ సంగీతం అందిస్తారు. వేదరామన్‌ కెమెరామేన్‌గా పని చేస్తారు’’అని చిత్రబృందం పేర్కొంది. 

Read latest Movies News and Telugu News | Follow us on FaceBook, Twitter

Advertisement

*మీరు వ్యక్తం చేసే అభిప్రాయాలను ఎడిటోరియల్ టీమ్ పరిశీలిస్తుంది, *అసంబద్ధమైన, వ్యక్తిగతమైన, కించపరిచే రీతిలో ఉన్న కామెంట్స్ ప్రచురించలేం, *ఫేక్ ఐడీలతో పంపించే కామెంట్స్ తిరస్కరించబడతాయి, *వాస్తవమైన ఈమెయిల్ ఐడీలతో అభిప్రాయాలను వ్యక్తీకరించాలని మనవి

Read also in:
Back to Top