బాలయ్య యాక్షన్‌.. ఎన్టీఆర్ వాయిస్‌..!

Sr NTR Voice For Few Scenes In Bala krishna NTR Biopic - Sakshi

నందమూరి బాలకృష్ణ స్వయంగా నటిస్తూ నిర్మిస్తున్న సినిమా యన్‌.టి.ఆర్‌. ప్రతిష్టాత్మకంగా తెరకెక్కుతున్న ఈ బయోపిక్‌కు క్రిష్‌ దర్శకత్వం వహిస్తున్నారు. ఇప్పటికే మేజర్‌ పార్ట్‌ షూటింగ్ పూర్తిచేసుకున్న ఈ సినిమా రెండు భాగాలుగా జనవరిలో రిలీజ్‌ కానుంది. తొలి భాగంలో ఎన్టీఆర్ సినీ జీవితం, రెండో భాగంలో ఆయన రాజకీయ జీవితాన్ని చూపించనున్నారు.

అయితే ఈ సినిమాలో ఎన్టీఆర్‌ రాజకీయ ప్రసంగాలను ప్రత్యేకంగా చూపించనున్నారట. ఎంతో ఆవేశంగా సాగే ఎన్టీఆర్‌ ప్రసంగాలు అప్పట్లో సంచలనం సృష్టించాయి. అందుకే సినిమాలో ఆ సన్నివేశాలకు మరింత స్కోప్‌ ఇస్తున్నట్టుగా తెలుస్తోంది. అంతేకాదు ఆ సన్నివేశాల్లో బాలయ్య ఎన్టీఆర్‌ పాత్రలో కనిపించినా.. డబ్బింగ్‌ మాత్రం చెప్పటం లేదట.

అప్పట్లో ఎన్టీఆర్ చేసిన ప్రసంగాల వాయిస్‌కే బాలయ్య యాక్ట్‌ చేస్తారట. అంటే బాలయ్య తెర మీద కనిపించినా గొంతు మాత్రం సీనియర్‌ ఎన్టీఆర్‌దే వినిపిస్తుందనమాట. ప్రస్తుతం ఈ ప్రచారం టాలీవుడ్ లో గట్టిగానే జరుగుతోంది. మరి ఈ వార్తలపై చిత్రయూనిట్ ఎలా స్పందిస్తుందో చూడాలి.

Read latest Movies News and Telugu News | Follow us on FaceBook, Twitter

Advertisement

*మీరు వ్యక్తం చేసే అభిప్రాయాలను ఎడిటోరియల్ టీమ్ పరిశీలిస్తుంది, *అసంబద్ధమైన, వ్యక్తిగతమైన, కించపరిచే రీతిలో ఉన్న కామెంట్స్ ప్రచురించలేం, *ఫేక్ ఐడీలతో పంపించే కామెంట్స్ తిరస్కరించబడతాయి, *వాస్తవమైన ఈమెయిల్ ఐడీలతో అభిప్రాయాలను వ్యక్తీకరించాలని మనవి

Read also in:
Back to Top