 
															‘స్పైడర్’ సంచలనం
టాలీవుడ్ అందగాడు మహేష్ బాబు తాజా చిత్రం ‘ స్పైడర్’ విడుదలకు ముందే సంచనాలు సృష్టిస్తొంది.
	హైదరాబాద్: టాలీవుడ్ అందగాడు మహేష్ బాబు తాజా చిత్రం ‘స్పైడర్’  విడుదలకు ముందే సంచనాలు సృష్టిస్తొంది. జూన్ 1 విడుదల చేసిన స్పైడర్ టీజర్ రికార్డు వ్యూస్‌తో దూసుకుపోతోంది. అత్యధిక మంది వీక్షించిన దక్షిణాది సినిమా టీజర్‌గా ఘనత సాధించింది. 24 గంటల్లో 63 లక్షల వ్యూస్ తెచ్చుకుని గత రికార్డులను తుడిచిపెట్టేసింది. వివేగమ్ పేరిట ఉన్న రికార్డు(60 లక్షల వ్యూస్) పేరిట ఉన్న రికార్డును అధిగమించి టాప్‌లో నిలిచింది. యూట్యూబ్‌లో ఇప్పటివరకు 6,904,003 వ్యూస్ నమోదయ్యాయి.
	
	స్పైడర్ టీజర్ చాలా బాగుందని అందరూ మెచ్చుకుంటున్నారు. మరుగదాస్ దర్శకత్వంలో తెలుగు, తమిళ భాషల్లో తెరకెక్కుతున్న ఈ సినిమా దసరాకు విడుదలకానుంది. మహేష్‌బాబు సరసన రకుల్‌ప్రీత్ హీరోయిన్‌గా నటించింది. ఠాగూర్ మధు సమర్పణలో భారీ బడ్జెట్‌తో ఆర్‌బీ చౌదరి నిర్మిస్తున్న ఈ సినిమాకు హరీశ్ జైరాజ్ సంగీతం అందిస్తున్నారు.
	
	24 గంటల్లో అత్యధిక వ్యూస్ సాధించిన దక్షిణాది చిత్రాలు
	1. స్పైడర్ (63 లక్షలు)
	2. వివేగమ్ (60 లక్షలు)
	3. కబాలి (51 లక్షలు)
	4. కాటమరాయుడు (37 లక్షలు)
	5. భైరవ (20 లక్షల 85 వేలు)
	6. సింగం 3 (20 లక్షల 74 వేలు)
	7. ఖైదీ నెంబర్ 150 (20 లక్షల 70 వేలు)
	8. డీజే దువ్వాగ జగన్నాథం (20 లక్షల 30 వేలు)
	9. తెరీ (20 లక్షల 30 వేలు)
	10. సాహో (20 లక్షల 20 వేలు)

 
  
                                                     
                                                     
                                                     
                                                     
                                                     
                         
                         
                         
                         
                        
