ఆమె కన్నుగీటితే.. అంతా ఇలా విలవిలలాడాల్సిందే! | SPOOF VIDEOS ON Priya Prakash Varrier WINKING | Sakshi
Sakshi News home page

ఆమె కన్నుగీటితే.. అంతా ఇలా విలవిలలాడాల్సిందే!

Feb 14 2018 11:10 AM | Updated on Feb 14 2018 12:13 PM

SPOOF VIDEOS ON Priya Prakash Varrier WINKING - Sakshi

ఎవరినీ విడిచిపెట్టలేదు. ఆమె కన్నుగీటితే.. ఎవరూ మాత్రం సిగ్గుపడకుండా ఉంటారు. ఎవరు మాత్రం ముసిముసి నవ్వులు నవ్వకుండా ఉంటారు. ఎవరు మాత్రం ఆమె కనుసైగల సెగలు తగలకుండా రాతిబొమ్మలుగా ఉండిపోగలరు. అందుకే మన నెటిజన్లు తమ క్రియేటివిటీకి పదును పెట్టారు. అమెరికా అధ్యక్షుడు డొనాల్డ్‌ ట్రంప్‌ మొదలు రాహుల్‌ గాంధీ వరకు.. అటు సినీ రంగంలో రజనీ మొదలు రానా వరకు అందరినీ ప్రియాప్రకాశ్‌ వారియర్‌ కనుసైగల వాలుచూపుల పరిధిలోకి తీసుకొచ్చారు. ఆమె కన్నుగీటితే.. వారు ఎలా స్పందిస్తారో చూపిస్తూ.. స్పూఫ్‌ వీడియోలు వదిలారు. ఇప్పుడు ఈ వీడియోలు విపరీతంగా హల్‌చల్‌ చేస్తున్నాయి. ముఖ్యంగా ప్రియా కన్నుగీటితే.. బ్రహ్మచారి రాహుల్‌గాంధీ ముసిముసి నవ్వులు రువ్వుతూ.. లోలోపల సిగ్గుపడుతున్నట్టు ఉన్న స్పూఫ్‌ నెటిజన్లను తెగ అలరిస్తోంది.

‘ఒరు ఆదార్‌ లవ్‌’ అనే మలయాళ సినిమాతో అరంగేట్రం చేస్తున్న ప్రియా ప్రకాశ్‌.. 40 సెకన్ల నిడివి ఉన్న కనుసైగల వీడియోతో ఓవర్‌నైట్‌​ ఇంటర్నెట్‌ సెన్సేషన్‌గా మారిన సంగతి తెలిసిందే. గన్నులాంటి కన్నులతో ఆమె కన్నుగీటినా.. తాజా టీజర్‌లో తూటాలాంటి ఫ్లయింగ్‌ కిస్‌తో ఎక్స్‌ప్రెషన్స్‌ ఇచ్చినా.. యువత అమాంతం ఫిదా అయిపోతున్నారు. ఇన్‌స్టాగ్రామ్‌లో ఆమెకు ఇప్పటికే మిలియన్‌కుపైగా ఫాలోవర్లు యాడ్‌ అయ్యారు.

పలువురిపై వచ్చిన స్ఫూప్‌ వీడియోలు ఇవే..

Advertisement
 
Advertisement
Advertisement