పులస చేప.. మంచి విందు! | Special song in 'C/o Godavari' | Sakshi
Sakshi News home page

పులస చేప.. మంచి విందు!

Feb 18 2017 11:25 PM | Updated on Sep 5 2017 4:02 AM

పులస చేప.. మంచి విందు!

పులస చేప.. మంచి విందు!

‘‘గోదావరిపై చాలా సినిమాలొచ్చాయి. సత్యం, ఇళయరాజా వంటి గొప్ప గొప్ప సంగీత దర్శకులు గోదావరిపై మంచి పాటలు స్వరపరిచారు

‘‘గోదావరిపై చాలా సినిమాలొచ్చాయి. సత్యం, ఇళయరాజా వంటి గొప్ప గొప్ప సంగీత దర్శకులు గోదావరిపై మంచి పాటలు స్వరపరిచారు. ఈ సినిమాలో నేను గోదావరి ఫేమస్‌ పులస చేపపై పాట చేశా. దానికి మంచి స్పందన వస్తోంది. వీనుల విందుగా ఉందని అందరూ అంటున్నారు. గొప్ప పాటల సరసన ఈ పాట నిలుస్తుందని నమ్ముతున్నా’’ అన్నారు సంగీత దర్శకుడు రఘు కుంచె.

రాజా రామ్మోహన్‌ చల్లా దర్శకత్వంలో తూము రామారావు, రాజేశ్‌ రంబాల, బొమ్మన సుబ్బారాయుడు నిర్మించిన సినిమా ‘కేరాఫ్‌ గోదావరి’. ఈ నెల 24న రిలీజవుతోన్న ఈ చిత్రానికి రఘు కుంచె సంగీత దర్శకుడు. దర్శకుడు మాట్లాడుతూ – ‘‘గోదావరి, ఆ నదిలో ప్రయాణం గురించి ఎంత చెప్పినా తక్కువే. కొత్త హీరో హీరోయిన్లతో గోదావరి నదిపై తీసిన ఈ సినిమా ప్రేక్షకులను అలరిస్తుందని ఆశిస్తున్నా’’ అన్నారు. నిర్మాతల్లో ఒకరైన బొమ్మన సుబ్బారాయుడు సహా చిత్ర బృందం పాల్గొన్నారు.

Advertisement
 
Advertisement
Advertisement