స్టార్ హీరోయిన్ పెళ్లి ఫిక్స్..? | sonam kapoor marriage fixed with anand ahuja | Sakshi
Sakshi News home page

స్టార్ హీరోయిన్ పెళ్లి ఫిక్స్..?

Jul 12 2017 11:01 AM | Updated on Sep 5 2017 3:52 PM

స్టార్ హీరోయిన్ పెళ్లి ఫిక్స్..?

స్టార్ హీరోయిన్ పెళ్లి ఫిక్స్..?

స్టార్ వారసురాలిగా బాలీవుడ్ ఎంట్రీ ఇచ్చి.. స్టైల్ ఐకాన్ గా గుర్తింపు తెచ్చుకున్న హాట్ బ్యూటీ సోనమ్ కపూర్. కెరీర్ లో

స్టార్ వారసురాలిగా బాలీవుడ్ ఎంట్రీ ఇచ్చి.. స్టైల్ ఐకాన్ గా గుర్తింపు తెచ్చుకున్న హాట్ బ్యూటీ సోనమ్ కపూర్. కెరీర్ లో చెప్పుకోదగ్గ సక్సెస్ లు లేకపోయినా.. గ్లామర్ షోతో ఎప్పుడూ వార్తల్లో ఉండే ఈ బ్యూటీ.. నీర్జా సినిమాతో నటిగానూ అందరి ప్రశంసలు అందుకుంది. ఇటీవలే ఫ్యాషన్ బిజినెస్ లోకి అడుగుపెట్టిన ఈ భామ త్వరలో పెళ్లిపీటలెక్కనుందట.

ఢిల్లీకి చెందిన ప్రముఖ బిజినెస్మేన్ ఆనంద్‌ అహుజా, సోనమ్‌ కపూర్‌ గత కొంతకాలంగా ప్రేమించుకుంటున్నారు. వీరిద్దరూ లివింగ్ రిలేషన్ షిప్ లో ఉన్నారన్న ప్రచారం కూడా జరుగుతోంది. గతంలో వీరిద్దరూ కలిసి హాలీడే ట్రిప్‌లకు వెళ్లిన ఫోటోలు సోషల్‌ మీడియాలో హల్ చల్ చేశాయి. ఇద్దరి ప్రేమకు ఇరు కుటుంబాలకు చెందిన పెద్దలు కూడా ఓకె చెప్పేశారట. దీంతో త్వరలోనే వీరిద్దరూ ఓ ఇంటివారు కానున్నారని వార్తలు వినిపిస్తున్నాయి. ఈ మధ్యే హిట్ ట్రాక్ ఎక్కిన ఈ భామ.. అప్పుడే పెళ్లి చేసుకుంటుందా అన్న అనుమానాలు వ్యక్తం చేస్తున్నారు బాలీవుడ్ విశ్లేషకులు.

Advertisement
 
Advertisement
Advertisement