నీలాంటి మగాళ్ల వల్లే!

Sonam Kapoor decides to go off Twitter - Sakshi

ట్వీటర్‌లో సోనమ్‌ కపూర్‌ ఎంత యాక్టివ్‌గా ఉంటారో ప్రత్యేకించి చెప్పక్కర్లేదు. ఆమెకు కోటి 20 లక్షల మంది ట్వీటర్‌ ఫాలోయర్స్‌ కూడా ఉన్నారు. కానీ ఇప్పుడు సడన్‌గా ట్వీటర్‌ నుంచి తప్పుకుంటున్నా అనేశారు సోనమ్‌. ‘‘నా ట్వీటర్‌ అకౌంట్‌ను ఆపేస్తున్నాను. నెగిటివిటీ బాగా పెరిగిపోయింది’’ అని పేర్కొన్నారు సోనమ్‌. తనుశ్రీ దత్తా వివాదం విషయంలో సోషల్‌ మీడియాలో ఎంతో యాక్టివ్‌గా ఉన్నారు సోనమ్‌. ఓ నెటిజన్‌ చేసిన విమర్శలే సోనమ్‌ ట్వీటర్‌కి ఫుల్‌స్టాప్‌ పెట్టడానికి కారణమని బాలీవుడ్‌ సినీ జనాలు విశ్లేషిస్తున్నారు. ఇటీవల ముంబైలో పబ్లిక్‌ ట్రాన్స్‌పోర్ట్‌ బాగా పెరిగిపోవడం వల్లే గమ్యం చేరుకోవడానికి తనకు బాగా ఆలస్యం అవుతోందని అర్థం వచ్చేలా సోనమ్‌ సోషల్‌ మీడియాలో ఓ పోస్ట్‌ పెట్టారు.

ఓ నెటిజన్‌ స్పందిస్తూ– ‘‘సోనమ్‌... ఈ పరిస్థితి మీ లాంటి వారి వల్లే. మీరు పబ్లిక్‌ ట్రాన్స్‌పోర్ట్‌ను ఉపయోగించరు. బాగా ఇందనం ఖర్చయ్యే వాహనాలనే వాడతారు. మీ ఇంట్లో దాదాపు 10 నుంచి 20 ఏసీలు వాడతారు. ఇలా గ్లోబల్‌ వార్మింగ్‌కి కారణం అవుతారు. ఫస్ట్‌ మీ పాపులేషన్‌ని కంట్రోల్‌ చేసుకో’’ అని బదులు చెప్పాడు. సోనమ్‌ కూడా ఏం తగ్గలేదు. ‘‘మీ లాంటి మగవారి వల్లే పబ్లిక్‌ ట్రాన్స్‌పోర్ట్‌లో ప్రయాణిస్తే లైంగిక వేధింపులకు గురి అవుతామేమోనని మహిళలు భయపడుతున్నారు’’ అని రెస్పాండ్‌ అయ్యారు సోనమ్‌. ఈ సంగతి ఇలా ఉంచితే.. ఆమె ఫొటో షేరింగ్‌ యాప్‌ ఇన్‌స్టాగ్రామ్‌లో యాక్టివ్‌గా ఉన్నారు. దాదాపు కోటీ నలభై లక్షల మంది ఫాలోయర్స్‌ ఉన్నారు.

Advertisement
Advertisement

*మీరు వ్యక్తం చేసే అభిప్రాయాలను ఎడిటోరియల్ టీమ్ పరిశీలిస్తుంది, *అసంబద్ధమైన, వ్యక్తిగతమైన, కించపరిచే రీతిలో ఉన్న కామెంట్స్ ప్రచురించలేం, *ఫేక్ ఐడీలతో పంపించే కామెంట్స్ తిరస్కరించబడతాయి, *వాస్తవమైన ఈమెయిల్ ఐడీలతో అభిప్రాయాలను వ్యక్తీకరించాలని మనవి

Back to Top