కమెడియన్ కు రాఖీ కట్టిన హీరోయిన్ | Sonakshi Sinha makes Kapil Sharma her brother, ties rakhi on his wrist | Sakshi
Sakshi News home page

కమెడియన్ కు రాఖీ కట్టిన హీరోయిన్

Aug 17 2016 4:56 PM | Updated on Sep 4 2017 9:41 AM

కమెడియన్ కు రాఖీ కట్టిన హీరోయిన్

కమెడియన్ కు రాఖీ కట్టిన హీరోయిన్

కామెడీ కింగ్ కపిల్ శర్మ ఇక తన షోకు బాలీవుడ్ తారలను ఆహ్వానించాల్సిన అవసరం రాదేమో.

ముంబై: కామెడీ కింగ్ కపిల్ శర్మ ఇక తన షోకు బాలీవుడ్ తారలను ఆహ్వానించాల్సిన అవసరం రాదేమో. బంధువులను స్వాగతిస్తే సరిపోయేట్టు ఉంది. ఎందుకంటే బాలీవుడ్ లో సగం మంది స్టార్స్ కపిల్ బంధువులే. ఇదంతా నిజమనుకుంటున్నారా? ఉత్తిదే. తమ సినిమాల ప్రమోషన్ కోసం తన షోకు వస్తున్న తారలను ఆట, పాటలతో వదిలి పెట్టకుండా సరదాగా బంధుత్వం కూడా కలిపేస్తున్నాడు కపిల్.

ఇటీవల హీరోయిన్ జాక్వెలెస్ ఫెర్నాండెజ్ ను సెట్లోలోనే పెళ్లాడేసి తన కల నెరవేరిందని సంబరపడిన కపిల్.. ఇప్పుడు సోదరిని ఎంచుకున్నాడు. హీరోయిన్ సొనాక్షి సిన్హాతో రాఖీ కట్టించుకుని సోదరుడిగా మురిసిపోయాడు. తన తాజా సినిమా 'అకిరా' సినిమా ప్రమోషన్ కోసం కపిల్ షోకు వచ్చిన సొనాక్షి సెట్లో సందడి చేసింది. పనిలో పనిగా తన సినిమా విశేషాలను ఏకరువు పెట్టింది. మురుగదాస్ దర్శకత్వం వహించి నిర్మించిన 'అకిరా' సినిమా సెప్టెంబర్ మొదటి వారంలో విడుదలకానుంది.

Advertisement

Related News By Category

Related News By Tags

Advertisement
 
Advertisement

పోల్

Advertisement