‘రా’ ఏజెంట్...సోనాక్షీ సిన్హా | Sonakshi Sinha Force -2 | Sakshi
Sakshi News home page

‘రా’ ఏజెంట్...సోనాక్షీ సిన్హా

Jul 17 2015 11:04 PM | Updated on Apr 3 2019 6:23 PM

‘రా’ ఏజెంట్...సోనాక్షీ సిన్హా - Sakshi

‘రా’ ఏజెంట్...సోనాక్షీ సిన్హా

గూఢచారి పాత్రల్లో ఇంతవరకు ఎక్కువగా హీరోల హవానే కొనసాగింది. అయితే, బాలీవుడ్ హీరోయిన్ సోనాక్షీ సిన్హా

గూఢచారి పాత్రల్లో ఇంతవరకు ఎక్కువగా హీరోల హవానే కొనసాగింది. అయితే, బాలీవుడ్ హీరోయిన్ సోనాక్షీ సిన్హా గూఢచారి పాత్రలో త్వరలోనే తెరపై కనిపించనున్నారు. ప్రస్తుతం ‘అకిరా’ సినిమా షూటింగ్‌లో ఉన్న సోనాక్షి, త్వరలోనే షూటింగ్ ప్రారంభం కానున్న ‘ఫోర్స్-2’లో ‘రా’ ఏజెంట్‌గా నటించనున్నారు. ‘ఫోర్స్’ చిత్ర దర్శకుడు అభినయ్ దేవ్, దానికి సీక్వెల్‌గా ‘ఫోర్స్-2’ను తెరకెక్కిస్తున్నాడు. ‘ఫోర్స్-2’లో ‘రా’ ఏజెంట్‌గా నటించనున్నాననీ, ఈ పాత్ర కోసం ఎదురుచూస్తున్నాననీ సోనాక్షి వెల్లడించారు.
 

Advertisement
 
Advertisement
Advertisement