నాలో మార్పు తెచ్చింది | sobhita dhulipala about kurup movie | Sakshi
Sakshi News home page

నాలో మార్పు తెచ్చింది

Feb 25 2020 12:59 AM | Updated on Feb 25 2020 1:01 AM

sobhita dhulipala about kurup movie - Sakshi

శోభితా ధూళిపాళ్ల

‘‘కొన్ని సినిమాల చిత్రీకరణ పూర్తవగానే ఎంతో నేర్చుకున్నాం, ఎన్నో జ్ఞాపకాల్ని సంపాదించుకున్నాం అనే అనుభూతి మిగులుతుంది. ‘కురుప్‌’ చిత్రం ఓ మంచి జ్ఞాపకం’’ అన్నారు శోభితా ధూళిపాళ్ల. దుల్కర్‌ సల్మాన్‌ హీరోగా శ్రీనాథ్‌ రాజేంద్రన్‌ తెరకెక్కించిన మలయాళ చిత్రం ‘కురుప్‌’. శోభితకి ఇది రెండో మలయాళ చిత్రం. కేరళ ప్రాంతంలో నివసించిన మోస్ట్‌ వాంటెడ్‌ క్రిమినల్‌ సుకుమార కురుప్‌ జీవితం ఆధారంగా ఈ సినిమా తీశారు.

ఈ సినిమా చిత్రీకరణ పూర్తయింది. ఈ సందర్భంగా శోభిత మాట్లాడుతూ – ‘‘కురుప్‌’ నా తొలి పూర్తి స్థాయి మలయాళ (గతంలో ‘మూతాన్‌’లో గెస్ట్‌ రోల్‌ చేశారు) చిత్రం. ఇది నా కెరీర్‌లో చాలా స్పెషల్‌ సినిమాగా నిలిచిపోతుంది. దానికి కారణం ఈ ప్రయాణంలో నాకు తెలియకుండానే ఎమోషనల్‌గా, క్రియేటివ్‌గా నాలో వచ్చిన మార్పు. నా పర్సనల్‌ క్యారెక్టర్‌ని ప్రభావితం చేసిన ప్రయాణమిది. ఇది మర్చిపోలేని ప్రయాణం’’ అన్నారు.

Advertisement

Related News By Category

Related News By Tags

Advertisement
 
Advertisement

పోల్

Advertisement