రాక్షసుడు! | sj surya new movie monster | Sakshi
Sakshi News home page

రాక్షసుడు!

Oct 4 2018 1:22 AM | Updated on Oct 4 2018 1:22 AM

sj surya new movie monster - Sakshi

ఎస్‌.జె. సూర్య

గతేడాది మహేశ్‌బాబు హీరోగా వచ్చిన ‘స్పైడర్‌’ సినిమాలో విలన్‌ పాత్ర చేసిన ఎస్‌.జె. సూర్య గుర్తుండే ఉంటారు. 2001లో పవన్‌ కల్యాణ్‌ హీరోగా వచ్చిన ‘ఖుషి’ చిత్రానికి కూడా ఎస్‌.జె.  సూర్యానే దర్శకుడని తెలిసిన విషయమే. అప్పుడప్పుడు హీరోగా, విలన్‌గా చేస్తుంటారాయన. ఇప్పుడు  సూర్య హీరోగా నటిస్తున్న చిత్రానికి ‘మాన్‌స్టర్‌’ అనే టైటిల్‌ని ఖరారు చేశారు. మాన్‌స్టర్‌ అంటే రాక్షసుడు, భూతం అనే మీనింగ్స్‌ ఉన్నాయి. ‘ఒరు నాళ్‌ కూత్తు’ దర్శకుడు నెల్సన్‌ ఈ సినిమాకు దర్శ కత్వం వహిస్తున్నారు. ప్రియా భవాని శంకర్‌ కథానాయికగా నటిస్తున్నారు. ఈ సినిమా చిత్రీకరణ పూర్తి కావొచ్చింది. పిల్లల నేపథ్యంలో ఈ సినిమా సాగనుంది. ఈ సినిమాను ఈ ఏడాదే విడుదల చేయాలనుకుంటున్నారు.

Advertisement
 
Advertisement
Advertisement