‘దొరసాని’ కోసం ఎదురు చూశాను

Sivatmika In Dorasani Movie Promotions - Sakshi

ఆనంద్ దేవరకొండ, శివాత్మికలను హీరో హీరోయిన్లుగా పరిచయం చేస్తూ మధుర ఎంటర్ టైన్మెంట్, బిగ్ బెన్ సినిమాలు సంయుక్తంగా నిర్మిస్తున్న మూవీ ‘దొరసాని’. ఈ చిత్రం జూలై 12న గ్రాండ్ గా రిలీజ్ అవుతున్న సంగతి తెలిసిందే. ట్రైలర్, పాటలతో ప్రేక్షకుల మనసులో ఈ మూవీ ప్రత్యేకమైన ముద్రను వేసింది. కేవీఆర్‌ మహేంద్ర దర్శకునిగా పరిచయం అవుతున్న ఈ మూవీ ప్రీ రిలీజ్ ఈవెంట్ ఆదివారం జరగనుంది. దొరసాని  ప్రమోషన్స్ లో బాగంగా ఈ రోజు మీడియాతో హీరోయిన్ శివాత్మిక ముచ్చటించారు.

‘షూటింగ్స్ అనేవి నా ఊహ తెలిసినప్పటి నుంచి నా జీవితంలో బాగమయ్యాయి. స్కూల్ కన్నా ఎక్కువగా షూటింగ్లోనే టైం స్పెండ్ చేసే దానిని. నేను హీరోయిన్ అవుతానంటే అందుకేనేమో ఇంట్లో ఎవరూ పెద్దగా సర్ ప్రైజ్ అవలేదు. కానీ దొరసాని రిలీజ్ టైం దగ్గర పడుతున్నప్పుడు మాత్రం ఇంట్లో సందడి ఎక్కువవుతోంది. ఈ కథ వింటున్నప్పుడు నా పాత్ర బాగా నచ్చింది. దర్శకుడు మహేంద్ర ఆ క్యారెక్టర్ని వివరించిన విధానం నన్ను బాగా ఇంప్రెస్ చేసింది. మొత్తం నాలుగు గంటల సేపు కథ చెప్పారు. ఆ తర్వాత ఆడిషన్స్‌ను నన్ను, ఆనంద్ని కలిపే చేసారు.  ఆడిషన్స్ కూడా అయ్యాక రెండు నెలలు  నాకు ఎలాంటి కబురు అందలేదు. ఆ టైం లో ఆ పాత్ర  కోసం నేను ఎదురు చూశాను. నేనే అని తెలిశాక చాలా ఎగ్జైట్ అయ్యాను’ అంటూ సినిమాకు సంబంధించిన విషయాలను వెల్లడించారు. మధుర శ్రీధర్ రెడ్డి, యశ్ రంగినేని సంయుక్తంగా నిర్మిస్తున్న ఈ సినిమాకు ప్రశాంత్‌ ఆర్‌ విహారి సంగీతాన్ని సమకూర్చారు.

Read latest Movies News and Telugu News | Follow us on FaceBook, Twitter

Advertisement

*మీరు వ్యక్తం చేసే అభిప్రాయాలను ఎడిటోరియల్ టీమ్ పరిశీలిస్తుంది, *అసంబద్ధమైన, వ్యక్తిగతమైన, కించపరిచే రీతిలో ఉన్న కామెంట్స్ ప్రచురించలేం, *ఫేక్ ఐడీలతో పంపించే కామెంట్స్ తిరస్కరించబడతాయి, *వాస్తవమైన ఈమెయిల్ ఐడీలతో అభిప్రాయాలను వ్యక్తీకరించాలని మనవి

Read also in:
Back to Top