పార్టీకి తయార్‌

SIDHARTH MALHOTRA TO PLAY A STUDENT IN HINDI REMAKE OF HIT KANNADA FILM, KIRIK PARTY - Sakshi

బాలీవుడ్‌ స్పైస్‌

కాలేజీ స్టూడెంట్‌గానే ఇండస్ట్రీలోకి ఎంట్రీ ఇచ్చారు సిద్ధార్థ్‌ మల్హోత్రా. అదేనండీ.. కరణ్‌ జోహార్‌ దర్శకత్వంలో వచ్చిన ‘స్టూడెంట్‌ ఆఫ్‌ ది ఇయర్‌’ సినిమా ద్వారా సిద్ధార్థ్‌ సిల్వర్‌ స్క్రీన్‌కి పరిచయం అయ్యారని చెబుతున్నాం. ఆల్మోస్ట్‌ ఐదేళ్ల తర్వాత ఇప్పుడు మళ్లీ స్టూడెంట్‌గా క్లాస్‌రూమ్‌కి వెళ్లేందుకు సిద్ధార్థ్‌ చర్చలు జరుపుతున్నాడని బీటౌన్‌ టాక్‌. అంతేకాదు  సిద్ధార్థ్‌తో పాటు సినిమాలో ఉండబోయే గ్యాంగ్‌ మెంబర్స్‌ అడ్మిషన్స్‌ కోసం ఆల్రెడీ ఆడిషన్స్‌ను కూడా స్టార్ట్‌ చేశారట.

మరి.. కాలేజీలో గ్యాంగ్‌ని మెయిన్‌టైన్‌ చేస్తారు కదా. కన్నడ సూపర్‌ హిట్‌ ‘కిర్రిక్‌ పార్టీ’కి రీమేక్‌గా ఈ చిత్రాన్ని రూపొందించనున్నారు. ఈ సినిమాలో  సిద్ధార్థ్‌తో పాటు నటించబోయే స్టూడెంట్స్‌ కోసం అడ్మిషన్స్‌.. అదేనండీ.. సెలెక్షన్స్‌ ఓపెన్‌ అన్నమాట. ‘కిర్రిక్‌ పారీ’్ట హిందీ రీమేక్‌ రైట్స్‌ దక్కించుకున్న అజయ్‌కపూర్‌ ఆల్రెడీ  సిద్ధార్థ్‌తో మాట్లాడారని, స్క్రిప్ట్‌ వర్క్‌ కూడా కంప్లీట్‌ అయ్యిందని సమాచారం. ఈ సంగతి ఇలా ఉంచితే... ఈ ‘కిర్రిక్‌ పార్టీ’ తెలుగులో నిఖిల్‌ హీరోగా ‘కిరాక్‌ పార్టీ’గా రీమేక్‌ అయింది. ఇందులో సిమ్రన్, సంయుక్తా హెగ్డే కీలక పాత్రలు చేశారు.

Back to Top