ప్రేమ.. యాక్షన్.. కామెడీ... | siddharth movie Released on September 2 | Sakshi
Sakshi News home page

ప్రేమ.. యాక్షన్.. కామెడీ...

Aug 30 2016 12:44 AM | Updated on Sep 4 2017 11:26 AM

ప్రేమ.. యాక్షన్.. కామెడీ...

ప్రేమ.. యాక్షన్.. కామెడీ...

సాగర్ హీరోగా కేవీ దయానంద్ దర్శకత్వంలో దాసరి కిరణ్‌కుమార్ నిర్మిస్తున్న చిత్రం ‘సిద్ధార్థ’. రాగిణీ నంద్వాణి,

 సాగర్ హీరోగా కేవీ దయానంద్ దర్శకత్వంలో దాసరి కిరణ్‌కుమార్ నిర్మిస్తున్న చిత్రం ‘సిద్ధార్థ’. రాగిణీ నంద్వాణి, సాక్షీ చౌదరి హీరోయిన్లు. మణిశర్మ సంగీతమందించిన పాటల్ని సెప్టెంబర్ 2న విడుదల చేస్తున్నారు. నిర్మాత మాట్లాడుతూ - ‘‘లవ్ అండ్ యాక్షన్ ఎంటర్‌టైనర్ ఇది. వినోదంతో పాటు మంచి ఎమోషనల్ కంటెంట్ ఉంటుంది. మెలోడీ బ్రహ్మ మణిశర్మ మంచి మ్యూజిక్ అందించారు. కథకు తగ్గట్టు పరుచూరి బ్రదర్స్ అద్భుతమైన డైలాగులు రాశారు. సెప్టెంబర్‌లోనే చిత్రాన్ని రిలీజ్ చేయాలనుకుంటున్నాం’’ అన్నారు. కోట శ్రీనివాసరావు, అజయ్, సుబ్బరాజు తదితరులు నటించిన ఈ చిత్రానికి సహ నిర్మాత: ముత్యాల రమేశ్.
 

Advertisement
 
Advertisement
Advertisement