breaking news
sakshi Choudhury
-
ఆ మాట అన్న ప్రతిసారి పెద్ద వసూళ్లు – రాజేంద్రప్రసాద్
‘‘సాధారణంగా చిన్న సినిమా, పెద్ద సినిమా అంటుంటారు. నా చిత్రాన్ని చిన్న సినిమా అన్న ప్రతిసారి పెద్ద వసూళ్లను సాధించాయి. ‘ఊ.పె.కు.హ’ సినిమా కూడా పెద్ద హిట్ అయి మంచి వసూళ్లు రాబడుతుంది’’ అని నటుడు రాజేంద్రప్రసాద్ అన్నారు. ఆయన ప్రధాన పాత్రలో ‘నిధి’ ప్రసాద్ దర్శకత్వంలో భాగ్యలక్ష్మి నిర్మించిన సినిమా ‘ఊ.పె.కు.హ’. ‘ఊళ్ళో పెళ్ళికి కుక్కల హడావుడి’ అన్నది ఉపశీర్షిక. సాక్షీ చౌదరి కథానాయిక. అనూప్ రూబెన్స్ స్వరాలందించారు. బిగ్ సీడీని నిర్మాత కిరణ్, ఆడియో సీడీలను రాజేంద్రప్రసాద్ విడుదల చేశారు. అనంతరం రాజేంద్రప్రసాద్ మాట్లాడుతూ– ‘‘నేను రాజ్–కోటిగారితో పనిచేసేటప్పుడు దిలీప్ అనే కీబోర్డ్ ప్లేయర్ ఉండేవాడు. తనే ఇప్పుడు ఎ.ఆర్.రెహమాన్ అయ్యారు. అనూప్ కూడా తాను కీ బోర్డ్ ప్లేయర్‌నని చెప్పుకోవడం వింటుంటే ఆనందంగా ఉంది. భాగ్యలక్ష్మి, విక్రమ్ ఈ సినిమాను చక్కగా నిర్మించారు’’ అన్నారు. ‘‘వినోదాత్మకంగా తెరకెక్కిన చిత్రమిది. మా సినిమాకు సంగీతం చేయమని అడిగే సమయంలో అనూప్ చాలా బిజీగా ఉన్నాడు. అయినా నేను అడిగానని ఒప్పుకుని, అనుకున్న సమయం కంటే ముందుగానే ఆడియో పూర్తి చేసి ఇచ్చినందుకు థ్యాంక్స్. త్వరలోనే సినిమా విడుదల తేదీ ప్రకటిస్తాం’’ అన్నారు ‘నిధి’ ప్రసాద్. భాగ్యలక్ష్మి, సాక్షీచౌదరి, అనూప్ రూబెన్స్ పాల్గొన్నారు. -
ప్రేమ.. యాక్షన్.. కామెడీ...
సాగర్ హీరోగా కేవీ దయానంద్ దర్శకత్వంలో దాసరి కిరణ్‌కుమార్ నిర్మిస్తున్న చిత్రం ‘సిద్ధార్థ’. రాగిణీ నంద్వాణి, సాక్షీ చౌదరి హీరోయిన్లు. మణిశర్మ సంగీతమందించిన పాటల్ని సెప్టెంబర్ 2న విడుదల చేస్తున్నారు. నిర్మాత మాట్లాడుతూ - ‘‘లవ్ అండ్ యాక్షన్ ఎంటర్టైనర్ ఇది. వినోదంతో పాటు మంచి ఎమోషనల్ కంటెంట్ ఉంటుంది. మెలోడీ బ్రహ్మ మణిశర్మ మంచి మ్యూజిక్ అందించారు. కథకు తగ్గట్టు పరుచూరి బ్రదర్స్ అద్భుతమైన డైలాగులు రాశారు. సెప్టెంబర్‌లోనే చిత్రాన్ని రిలీజ్ చేయాలనుకుంటున్నాం’’ అన్నారు. కోట శ్రీనివాసరావు, అజయ్, సుబ్బరాజు తదితరులు నటించిన ఈ చిత్రానికి సహ నిర్మాత: ముత్యాల రమేశ్.