ఇక ఫేస్‌బుక్‌లోనూ శ్రుతి | Shruti Haasan joins Facebook | Sakshi
Sakshi News home page

ఇక ఫేస్‌బుక్‌లోనూ శ్రుతి

Feb 25 2014 4:00 AM | Updated on Jul 26 2018 5:21 PM

ఇక ఫేస్‌బుక్‌లోనూ  శ్రుతి - Sakshi

ఇక ఫేస్‌బుక్‌లోనూ శ్రుతి

ఆధునిక టెక్నాలజీ అందుబాటులోకి వచ్చిన తరువాత జనాన్ని ట్విట్టర్, ఫేస్‌బుక్‌లు చాలా ప్రభావితం చేస్తున్నాయి. ముఖ్యంగా సినిమా వాళ్లకు ప్రచారానికి ఈ వెబ్‌సైట్లు

 ఆధునిక టెక్నాలజీ అందుబాటులోకి వచ్చిన తరువాత జనాన్ని ట్విట్టర్, ఫేస్‌బుక్‌లు చాలా ప్రభావితం చేస్తున్నాయి. ముఖ్యంగా సినిమా వాళ్లకు ప్రచారానికి ఈ వెబ్‌సైట్లు చాలా దోహదపడుతున్నాయి. ప్రమోట్ చేసుకోవడానికి ఇప్పటి వరకు మీడియూను ఆశ్రయించిన తారలు ఇప్పుడు ఇంటర్నెట్ ద్వారా ట్విట్టర్, ఫేస్‌బుక్‌లను వాడుకుంటున్నారు.  సినిమా వివరాలను, విశేషాలను ట్విట్టర్ ద్వారా అభిమానులతో పంచుకుంటూ వస్తున్న నటి శ్రుతిహాసన్ తాజాగా ఫేస్‌బుక్ ఖాతాను ఓపెన్ చేసిందట.
 
  ఈ విషయాన్ని ఈ క్రేజీ హీరోయిన్ తన ట్విట్టర్‌లో పేర్కొంటూ http://www.facebook. com/shrutihaasan పేరుతో ఫేస్‌బుక్ అకౌంట్‌ను ప్రారంభించానని తెలిపారు. తన చిత్రాలకు సంబంధించిన కొత్త కొత్త విషయాలు, ఫొటోలు తెలుసుకోవడానికి ఈ ఫేస్‌బుక్‌ను చూడడంటూ పేర్కొన్నారు. ఇప్పటి వరకు శ్రుతి ట్విట్టర్‌ను 9,29,000 మంది ఫాలో అవుతున్నారట. దీంతోనే అర్థమవుతుందిగా శ్రుతి స్టార్ పవర్ ఏమిటో. ఇక ఆమె ఫేస్ బుక్ లవర్స్ ఎంత మంది అవుతారో వేచిచూడాల్సిందే. 
 

Advertisement

Related News By Category

Related News By Tags

Advertisement
 
Advertisement

పోల్

Advertisement