
చిన్న ఉద్యోగం చేసుకుంటూ లైఫ్‌ని లీడ్ చేస్తుంది ఓ అమాయకురాలైన అమ్మాయి. చెప్పుకోవాల్సినంత బాధలు, గుర్తుపెట్టుకోవాల్సినన్ని బాధ్యతలు తనకు లేవు. ఒక్క మాటలో చెప్పాలంటే.. హ్యాపీ లైఫ్ అన్నమాట. కానీ ఎప్పుడూ ఒకేలా ఉంటే అది జీవితం ఎందుకు అవుతుంది. సడన్‌గా ఓ ఇన్సిడెంట్. లైఫ్ అంతా టోటల్ చేంజ్. ఏంటా ఇన్సిండెట్? దాని వల్ల ఆ అమ్మాయి జీవితంలో వచ్చిన మార్పులేంటి? అంటే ప్రజెంట్ సస్పెన్స్. ఆ అమాయకురాలి పాత్రలో నటిస్తున్నారు శ్రియ.
సుజన దర్శకురాలిగా పరిచయమవుతున్న ఈ లేడీ ఓరియంటెడ్ మూవీలో శ్రియ ముఖ్య తార. ఇళయరాజా సంగీతం అందించనున్న ఈ చిత్రం ద్వారా ఛాయాగ్రాహకుడు వీఎస్ జ్ఞానశేఖర్ నిర్మాతగా మారుతున్నారు. సాయిమాధవ్ బుర్రా మాటలు అందించనున్నారు. ‘‘నటీనటుల ఎంపిక ఆల్మోస్ట్ కంప్లీట్ అయ్యింది. సెట్ డిజైన్ వర్క్స్ జరుగుతున్నాయి. మార్చి ఫస్ట్ వీక్‌లో షూటింగ్ స్టార్ట్ చేయాలనుకుంటున్నాం’’ అన్నారు సుజన.