ఓ సలహా.. ప్లీజ్‌..

shriya books reading - Sakshi

... అంటున్నారు శ్రియ. ఇంతకీ ఏ విషయంలో సలహా కావాలి? అంటే.. బుక్స్‌ గురించి. ఈ బ్యూటీ బాగా పుస్తకాలు చదువుతారు. ‘‘ఏదైనా మంచి పుస్తకం ఉంటే సూచించండి. ప్రభావితం చేసే జీవిత కథలు, మంచి ప్రేమకథలు, చరిత్రకు సంబంధించిన బుక్స్‌ గురించి చెప్పండి’’ అంటున్నారు. ఒక్క కండిషన్‌ పెట్టారు. మర్డర్‌ మిస్టరీ, హారర్‌ పుస్తకాల గురించి మాత్రం చెప్పొద్దంటున్నారామె. ఏం? అలాంటి బుక్స్‌ చదవాలంటే భయమా? అనడిగితే – ‘‘భయం కాదు.

అవి చదవడం వల్ల మనం ఏం నేర్చుకుంటాం? మంచి పుస్తకాలు చదివితే చాలా విషయాలు తెలుస్తాయి. మన జ్ఞానం పెరుగుతుంది’’ అన్నారు. ఇంత తీరికగా బుక్స్‌ గురించి అడుగుతున్నారంటే శ్రియ చేతిలో సినిమాలు లేవనుకుంటున్నారేమో? తమిళ, తెలుగు భాషల్లో రూపొందుతోన్న ‘నరగసూరన్‌’, తెలుగు చిత్రం ‘వీరభోగ వసంతరాయలు’లో నటిస్తున్నారు. షూటింగ్‌ స్పాట్‌లో ఏమాత్రం గ్యాప్‌ దొరికినా ఏదొక బుక్‌ చదువుతుంటారు.

Read latest Movies News and Telugu News | Follow us on FaceBook, Twitter, Telegram



 

Read also in:
Back to Top