కోలీవుడ్‌ కాలింగ్‌ | Shivani signs a Tamil film | Sakshi
Sakshi News home page

కోలీవుడ్‌ కాలింగ్‌

Jul 15 2018 1:45 AM | Updated on Jul 15 2018 1:45 AM

Shivani signs a Tamil film - Sakshi

శివానీ

ఇంకా సిల్వర్‌ స్క్రీన్‌పైకి ఎంట్రీ ఇవ్వలేదు. హీరోయిన్‌గా చేస్తున్న సినిమా ఆన్‌ సెట్స్‌లో ఉంది. కానీ కోలీవుడ్‌ నుంచి శివానీకి కబురొచ్చింది. జీవితా రాజశేఖర్‌ల కుమార్తె శివానీ హిందీ ‘2 స్టేట్స్‌’ తెలుగు రీమేక్‌లో నటిస్తున్న విషయం తెలిసిందే. తమిళ ఆఫర్‌ గురించి చెప్పాలంటే... విష్ణు విశాల్‌ హీరోగా వెంకటేశ్‌ దర్శకత్వంలో ఓ సినిమా రూపొందనుంది. ఇందులోనే కథానాయికగా చాన్స్‌ను దక్కించుకున్నారు శివానీ.

ఈ సినిమా షూట్‌లో పాల్గొనడానికే ప్రస్తుతం ఆమె చెన్నైలో ఉన్నారని సమాచారం. లవ్‌స్టోరీ బ్యాక్‌డ్రాప్‌లో తెరకెక్కే ఈ సినిమాలో పల్లెటూరి అమ్మాయి క్యారెక్టర్‌లో కనిపిస్తారట శివానీ. ఇదిలా ఉంటే మన తెలుగమ్మాయి శివానీ ఈ చిత్రం ద్వారా తమిళ పరిశ్రమకు వెళుతుంటే, ఈ చిత్ర కథానాయకుడు విష్ణు విశాల్‌.. రానా హీరోగా నటిస్తున్న ‘అరణ్యం’ సినిమా ద్వారా తెలుగు పరిశ్రమకు పరిచయం కానున్నారు.

Advertisement
 
Advertisement
Advertisement