ఆమె నిరీక్షణ | she ......... is waiting .movie lounch | Sakshi
Sakshi News home page

ఆమె నిరీక్షణ

Jan 4 2016 11:39 PM | Updated on Sep 3 2017 3:05 PM

ఆమె నిరీక్షణ

ఆమె నిరీక్షణ

‘‘మన సంస్కృతి, సంప్రదాయాలకు చాలా విలువలున్నాయి......

‘‘మన సంస్కృతి, సంప్రదాయాలకు చాలా విలువలున్నాయి. వాటిని ఎలా కాపాడుకోవాలి? అనే అంశానికి భయాన్ని జోడించి తెరకెక్కిస్తున్న స్వచ్ఛమైన ప్రేమకథ ఇది’’ అని దర్శకుడు పర్స రమేష్ మహేంద్ర అన్నారు. శ్వేతామీనన్, మహత్ రాఘవేంద్ర, చేతన ఉత్తేజ్, సోనియా అగర్వాల్ ప్రధాన పాత్రల్లో మహేశ్వర ఆర్ట్స్ పతాకంపై కల్వకుంట్ల తేజేశ్వర్‌రావ్(కన్నారావ్) నిర్మిస్తున్న చిత్రం ‘షీ’. ‘ఈజ్ వెయిటింగ్’ అనేది ఉపశీర్షిక.
 
  ‘‘ఈ చిత్రం ప్రస్తుతం సెకండ్ షెడ్యూల్ జరుపుకుంటోంది. మార్చిలో సినిమాను విడుదల చేయడానికి ప్లాన్ చేస్తున్నాం’’ అని నిర్మాత తెలిపారు. ‘‘ప్రస్తుతం పాట చిత్రీకరణ జరుగుతోంది. పంచభూతాల నేపథ్యంలో ఈ పాట ఉంటుంది. ఈ సినిమా అందరికీ మంచి పేరు తెస్తుంది’’ అని చేతన ఉత్తేజ్ అన్నారు. ఈ చిత్రానికి సంగీతం: బోలే, కెమెరా: అనిత్, లైన్ ప్రొడ్యూసర్: గట్టు విజయ్ గౌడ్, ఎగ్జిక్యూటివ్ నిర్మాత: బసంత్ రెడ్డి.
 

Advertisement
 
Advertisement
Advertisement