నాగ్ అట్టర్ ప్లాప్ సినిమాలు కూడా ఐదుసార్లు చూశా | Shashank Vennelakanti comments on actor nagarjuna utter flop movies | Sakshi
Sakshi News home page

నాగ్ అట్టర్ ప్లాప్ సినిమాలు కూడా ఐదుసార్లు చూశా

Aug 1 2014 12:26 PM | Updated on Jul 15 2019 9:21 PM

నాగ్ అట్టర్ ప్లాప్ సినిమాలు కూడా ఐదుసార్లు చూశా - Sakshi

నాగ్ అట్టర్ ప్లాప్ సినిమాలు కూడా ఐదుసార్లు చూశా

అభిమానం ఎక్కువైనా ఒకోసారి నటీనటులు ఇబ్బంది పడుతుంటారు. అలాంటి సంఘటనపై ప్రముఖ హీరో నాగార్జునకు ఎదురైంది.

అభిమానం ఎక్కువైనా ఒకోసారి నటీనటులు ఇబ్బంది పడుతుంటారు. అలాంటి సంఘటనపై ప్రముఖ హీరో నాగార్జునకు ఎదురైంది. అదీ కూడా సినీ ప్రముఖుల సమక్షంలో ఓ వీరాభిమాని తన మనసులో మాటను బయటపెట్టి మరీ తన అభిమానాన్ని చాటుకున్నాడు. సూర్య, సమంత జంటగా నటించిన సికిందర్ చిత్ర ఆడియో ఆవిష్కరణ కార్యక్రమం ఈ సంఘటనకు వేదిక అయ్యింది.

మాటలు, పాటల రచయిత వెన్నెలకంటి శశాంక్ మాట్లాడుతూ తాను నాగార్జున వీరాభిమాని అని... ఆయన నటించిన అట్టర్ ప్లాప్ చిత్రాలు కూడా అయిదుసార్లు చూశానంటూ వెల్లడించాడు. దాంతో నాగ్ ఒకింత ఇబ్బందిగా ఫీల్ అయినా వెంటనే నవ్వేశారు. నాగార్జునతో పాటు ఆ వేడుకకు హాజరైన సినీ ప్రముఖులు కూడా శశాంక్ మాటలకు చిరునవ్వులు చిందించారు. నాగార్జునను  ప్రత్యక్షంగా చూడటం తనకు చాలా సంతోషకరంగా ఉందని శశాంక్, ఈ వేడుక తనకు చాలా చాలా స్పెషల్ అంటు ముగించాడు.

 

Advertisement

Related News By Category

Related News By Tags

Advertisement
 
Advertisement

పోల్

Advertisement