రేఖతో నటించేందుకు నేను రెడీ | SHAMITABH Official Video Trailer released by Amitabh Bachchan | Sakshi
Sakshi News home page

రేఖతో నటించేందుకు నేను రెడీ

Jan 8 2015 12:23 PM | Updated on Apr 3 2019 6:23 PM

రేఖతో నటించేందుకు నేను రెడీ - Sakshi

రేఖతో నటించేందుకు నేను రెడీ

బాలీవుడ్ అందాల తార రేఖతో నటించేందుకు తాను సిద్ధంగా ఉన్నానని బాలీవుడ్ మెగాస్టార్ అమితాబ్ బచ్చన్ వెల్లడించారు.

ముంబై: బాలీవుడ్ అందాల తార రేఖతో నటించేందుకు తాను సిద్ధంగా ఉన్నానని బాలీవుడ్ మెగాస్టార్ అమితాబ్ బచ్చన్ వెల్లడించారు. గురువారం షమితాబ్ చిత్రానికి సంబంధించిన ట్రైలర్ను ఆయన విడుదల చేశారు. ఈ సందర్బంగా రేఖతో నటించేందుకు తాను సిద్ధమేనంటూ అమితాబ్ తన మనస్సులోని మాటను బయటపెట్టారు.

గతంలో ఈ ఇద్దరి కాంబినేషన్లో వచ్చిన సిల్సిలా, మిస్టర్ నట్వర్లాల్, ముఖద్దార్ కా సికిందర్ చిత్రాలు బాక్సాఫీసు రికార్డులు బద్దలు కొట్టిన సంగతి తెలిసిందే. అయితే రేఖలో నటించేందుకు సిద్ధంగా ఉన్నానని చెప్పిన బిగ్బీ మాటలకు ఆమె భార్య ఎలా స్పందిస్తుందో చూడాలి.

Advertisement
 
Advertisement
Advertisement