డ్రైవర్‌ రాముడి ఆటా పాటా | shakalaka shankar as driver ramudu getting ready | Sakshi
Sakshi News home page

డ్రైవర్‌ రాముడి ఆటా పాటా

Jul 17 2018 12:33 AM | Updated on Sep 29 2018 5:33 PM

shakalaka shankar as driver ramudu getting ready - Sakshi

షకలక శంకర్‌

హాస్యనటుడిగా ప్రేక్షకులకు నవ్వుల కితకితలు పెట్టిన ‘షకలక’ శంకర్‌ ‘శంభో శంకర’ చిత్రంతో హీరోగా మారిన విషయం తెలిసిందే. తాజాగా శంకర్‌ హీరోగా నటిస్తోన్న చిత్రం ‘డ్రైవర్‌ రాముడు’. అంచల్‌ సింగ్‌ కథానాయిక. రాజ్‌ సత్య దర్శకత్వంలో వేణుగోపాల్, ఎమ్‌.ఎల్‌. రాజు, టి. కీరత్‌ నిర్మిస్తోన్న ఈ చిత్రం ప్రస్తుతం ఐటమ్‌ సాంగ్‌ చిత్రీకరణ జరుపుకుంటోంది. రాజ్‌ సత్య మాట్లాడుతూ– ‘‘మా ‘డ్రైవర్‌ రాముడు’ చిత్రీకరణ దాదాపు పూర్తయింది. ప్రస్తుతం భారీ సెట్‌లో శివశంకర్‌ మాస్టర్‌ నేతృత్వంలో ఐటమ్‌ సాంగ్‌ చిత్రీకరిస్తున్నాం.

సినిమా చాలా బాగా వస్తోంది. త్వరలోనే విడుదల చేస్తాం’’ అన్నారు. ‘‘మా దర్శకుడు రాజ్‌ సత్య భారీ సినిమాలాగా ‘డ్రైవర్‌ రాముడు’ని చిత్రీకరిస్తున్నారు. ఇప్పటికే విడుదలైన పోస్టర్, మొదటి టీజర్‌కు మంచి స్పందన వచ్చింది. సునీల్‌ కశ్యప్‌ సంగీతం ఈ చిత్రానికి హైలైట్‌. ఐటమ్‌ సాంగ్‌ యువతను ఉర్రూతలూగిస్తుంది’’ అన్నారు నిర్మాతలు. ప్రదీప్‌ రావత్, నాజర్, ‘తాగుబోతు’ రమేశ్, ధన్‌రాజ్, మహేశ్‌ విట్టా నటిస్తున్న ఈ చిత్రానికి సమర్పణ: మాస్టర్‌ ప్రణవ్‌ తేజ్, కెమెరా: అమర్‌ నాథ్‌.

Advertisement

Related News By Category

Related News By Tags

Advertisement
 
Advertisement

పోల్

Advertisement