షాహిద్‌ ఈజ్‌ అర్జున్‌ రెడ్డి | Shahid Kapoor confirmed for Hindi remake of Arjun Reddy | Sakshi
Sakshi News home page

షాహిద్‌ ఈజ్‌ అర్జున్‌ రెడ్డి

Apr 27 2018 12:31 AM | Updated on Apr 27 2018 12:31 AM

Shahid Kapoor confirmed for Hindi remake of Arjun Reddy - Sakshi

సందీప్‌ రెడ్డి వంగా, షాహిద్‌ కపూర్‌

‘రణ్‌వీర్‌ సింగ్‌ చేస్తాడు. లేదు.. లేదు.. అర్జున్‌ కపూర్‌ చేస్తాడు’ అంటూ తెలుగు సూపర్‌ హిట్‌ మూవీ ‘అర్జున్‌ రెడ్డి’ బాలీవుడ్‌లో రీమేక్‌లో అవుతుందని తెలిసినప్పటి నుంచి పలువురి హీరోల పేర్లు వినిపించాయి. కానీ, ఫైనల్‌గా బాలీవుడ్‌ ‘అర్జున్‌ రెడ్డి’ దొరికేశాడు. హిందీ రీమేక్‌లో అర్జున్‌ రెడ్డి పాత్రలో షాహిద్‌ కపూర్‌ కనిపించనున్నారు. తెలుగు వెర్షన్‌ను డైరెక్ట్‌ చేసిన సందీప్‌ రెడ్డి వంగా బాలీవుడ్‌ రీమేక్‌నూ డైరెక్ట్‌ చేయనున్నారు. జులై నుంచి సెట్స్‌పైకి వెళ్లనున్న ఈ సినిమాను మురాద్‌ ఖేతానీ, అశ్విన్‌ వార్దే నిర్మించనున్నారు.

‘‘కాలేజ్‌ పోర్షన్‌ను ఢిల్లీలో షూట్‌ చేయనున్నాం. బాలీవుడ్‌లో ఇంకా ఫ్రీడమ్‌  ఉంటుంది. ఈ కథను ఇంకా ‘రా’గా చూపించే ప్రయత్నం చేస్తాను. షాహిద్‌ కపూర్‌ చాలా టాలెంటెడ్‌ యాక్టర్‌. అర్జున్‌ రెడ్డి క్యారెక్టర్‌ను బాలీవుడ్‌ ఆడియన్స్‌ను మెప్పించేలా చేస్తాడనే నమ్మకం ఉంది’’ అని పేర్కొన్నారు సందీప్‌ రెడ్డి వంగా. ఈ సినిమాకు సంబంధించి మిగతా నటీనటులు, టెక్నికల్‌ టీమ్‌ను ఫైనలైజ్‌ చేయాల్సి ఉంది. 2019 మార్చి 19న ఈ చిత్రాన్ని రిలీజ్‌ చేయాలనుకుంటున్నారు.

నెక్ట్స్‌ మహేశ్‌తో..
డైరెక్టర్‌ సందీప్‌ వంగా బాలీవుడ్‌ ‘అర్జున్‌ రెడ్డి’ రీమేక్‌ కంప్లీట్‌ చేయగానే మహేశ్‌బాబుతో ఓ సినిమా ఉంటుందని సమాచారం. ఆల్రెడీ మహేశ్‌బాబు కథ వినేసి గ్రీన్‌ సిగ్నల్‌ కూడా ఇచ్చారట. మహేశ్‌ 27వ సినిమాగా రూపొందే అవకాశం ఉందట. బహుశా హిందీ రీమేక్‌ తర్వాత సందీప్‌ చేయబోయేది ఈ ప్రాజెక్టే అవుతుందేమో?. హిందీ ‘అర్జున్‌ రెడ్డి’ వచ్చే ఫిబ్రవరిలో పూర్తి అవుతుంది. ఆ తర్వాత మహేశ్‌బాబు–సందీప్‌ సినిమా మొదలవుతుందని ఊహించవచ్చు.

Advertisement
 
Advertisement
Advertisement