మా రాకుమారుడి పేరెంటో తెలుసా?

Shahid Kapoor And Mira Rajput Name Their Son Zain Kapoor - Sakshi

బాలీవుడ్‌లో బెస్ట్‌ జోడి షాహిద్‌ కపూర్‌, మీరా రాజ్‌పుత్‌లు. వీరి ఇంట ఇప్పుడు ఆనందాలు వెల్లివిరుస్తున్నాయి. మీరా నిన్న సాయంత్రం పండంటి మగబిడ్డకు జన్మనిచ్చింది. తమ చిన్ని రాకుమారుడు పేరును షాషిద్‌ కపూర్‌, అందరూ ఊహించినట్టుగానే నేడు ట్విటర్‌ అకౌంట్‌ ద్వారా వెల్లడించాడు. తమ రాకుమారుడు పేరు ‘జైన్‌ కపూర్‌’ గా పేర్కొన్నాడు. ‘జైన్‌ కపూర్‌ ఇక్కడ. మేము పూర్తి అనుభూతి చెందుతున్నాం. అందరి అభినందనలకు, ఆశీర్వాదాలకు ధన్యవాదాలు. మేము చాలా ఎంజాయ్‌ చేస్తున్నాం. లవ్‌ టూ ఆల్‌’ అని ట్వీట్‌ చేశారు. అంతేకాక, షాహిద్‌ కపూర్‌ తన భార్య కోసం ప్రత్యేకంగా ఓ క్యూట్‌ బర్త్‌డే కేక్‌ను కూడా డిజైన్‌ చేయించారు. డఫోడిల్‌క్రియేషన్స్‌ ఈ కేక్‌ను డిజైన్‌ చేశారు. దానిపై హ్యాపీ బర్త్‌డే మదర్‌ హెన్‌ అని రాయించాడు షాహిద్‌. 

తన చిన్ని రాకుమారుడి పేరును రివీల్‌ చేస్తూ షాహిద్‌ కపూర్‌ చేసిన ట్వీట్‌కు అభినందనలు వెల్లువెత్తుతున్నాయి. ‘జైన్‌ కపూర్‌ కూడా తన పేరు లాగా చాలా అందంగా ఉంటాడు. బేబి బాయ్‌ను చూడటానికి మేమందరం ఎంతో ఆతృతగా వేచిచూస్తున్నాం’ అని డాక్టర్‌ ఇందిరా ట్వీట్‌ చేశారు. ‘జైన్‌ చూడటానికి మేమందరం వేచిచేయలేకపోతున్నాం. మా ప్రేమను, అభినందనలను పంపుతున్నాం’టాటాస్కై కూడా ట్వీట్‌ చేసింది. ఆల్రెడీ షాహిద్, మీరా దంపతులకు మిషా అనే కుమార్తె ఉన్న సంగతి తెలిసిందే. ఇప్పుడు బాబు పుట్టడంతో, వారి ఫ్యామిలీ పూర్తైనట్టు కుటుంబ సభ్యులు ఆనందం వ్యక్తం చేస్తున్నారు. 

Advertisement
Advertisement

*మీరు వ్యక్తం చేసే అభిప్రాయాలను ఎడిటోరియల్ టీమ్ పరిశీలిస్తుంది, *అసంబద్ధమైన, వ్యక్తిగతమైన, కించపరిచే రీతిలో ఉన్న కామెంట్స్ ప్రచురించలేం, *ఫేక్ ఐడీలతో పంపించే కామెంట్స్ తిరస్కరించబడతాయి, *వాస్తవమైన ఈమెయిల్ ఐడీలతో అభిప్రాయాలను వ్యక్తీకరించాలని మనవి

Back to Top