స్వీట్ వివాదంలో చిక్కుకున్న షారుక్ 'ఫ్యాన్'..! | Shah Rukh Khan movie FAN on trouble now | Sakshi
Sakshi News home page

స్వీట్ వివాదంలో చిక్కుకున్న షారుక్ 'ఫ్యాన్'..!

May 7 2016 11:26 AM | Updated on Apr 3 2019 6:34 PM

స్వీట్ వివాదంలో చిక్కుకున్న షారుక్ 'ఫ్యాన్'..! - Sakshi

స్వీట్ వివాదంలో చిక్కుకున్న షారుక్ 'ఫ్యాన్'..!

బాలీవుడ్ బాద్ షా షారుక్ ఖాన్ హీరోగా తెరకెక్కిన లేటెస్ట్ థ్రిల్లర్ మూవీ 'ఫ్యాన్'.

న్యూఢిల్లీ: బాలీవుడ్ బాద్ షా షారుక్ ఖాన్ హీరోగా తెరకెక్కిన లేటెస్ట్ థ్రిల్లర్ మూవీ 'ఫ్యాన్'. ఈ మూవీతో గత కొన్ని రోజులుగా తనపై వస్తున్న విమర్శలకు చెక్ పెట్టేశాడు షారుక్. అయితే 'ఫ్యాన్' మూవీ పెద్దలకు ఢిల్లీకి చెందిన ఓ మిఠాయివాలా షాకిచ్చాడు. నిర్మాతలు, హీరో షారుక్, మరికొందరికి లీగల్ నోటీసులు పంపిన విషయం ఆలస్యంగా వెలుగులోకి వచ్చింది. స్వీట్ బ్రాండ్ కు సంబంధించి మూవీలో ఉన్న సీన్లు, డైలాగ్స్ తొలగించాలని డిమాండ్ చేస్తున్నాడు.

అసలు విషయం ఏంటంటే...
ఫ్యాన్ మూవీలో గౌరవ్ పాత్రలో కనిపించే షారుక్ స్వీట్ బాక్స్ తీసుకుని హీరో ఆర్యన్ ఖన్నా(హీరో షారుక్)ను కలిసేందుకు వెళ్లే సీన్ గుర్తుంది కదా. ఆ స్వీట్ బాక్స్ పై 'ఘంటేవాలా' అనే పేరు కనిపిస్తుంది. ఈ స్వీట్ షాపు ఓనర్ సుశాంత్ జైన్ ఈ విషయాన్ని చాలా సీరియస్ గా తీసుకున్నాడు. తన అనుమతి లేకుండా, తమను సంప్రదించకుండా తమ బ్రాండ్ ఎలా వాడుకుంటారంటూ ప్రశ్నిస్తూ యశ్రాజ్ ఫిల్మ్స్, ఆదిత్యా చోప్రా, దర్శకుడు మనీష్ శర్మ, రైటర్స్ హబీబ్ ఫైజల్, శరత్ కథారియా, హీరో షారుక్ ఖాన్ కు లీగల్ నోటీసులు పంపించాడు.

Advertisement

Related News By Category

Related News By Tags

Advertisement
 
Advertisement

పోల్

Advertisement