స్వదేశీ ‘కావేరి అమ్మ’ మృతి

Senior Kannda Actress Kishori Ballal Dies At 82 In Bengaluru - Sakshi

సినీ ప్రముఖుల వరుస మరణాలు చిత్రపరిశ్రమను కలవరపెడుతున్నాయి. తాజాగా సీనియర్‌ కన్నడ నటి కిషోరి బల్లాళ్‌(82 సంవత్సరాలు) మంగళవారం అనారోగ్యంతో మృతి చెందడం సాండల్‌వుడ్‌లో విషాదం నింపింది. బెంగళూరులోని ఆసుపత్రిలో ఆమె తుదిశ్వాస విడిచారు. దక్షిణ కన్నడలో జన్మించిన బల్లాళ్‌ 1960లో ‘ఇవలెంత హెందాతీ’ చిత్రంతో వెండతెరపై తెరంగ్రేటం చేశారు. ఐదు దశాబ్దాల సినీప్రయాణంలో సుమారు 75 సినిమాలకు పైగా నటించింది. బాలీవుడ్‌ నటుడు షారుఖ్‌ఖాన్‌ సినిమా స్వేలో నటించిన తరువాత బాలీవుడ్‌ హీరో షారుఖ్‌ ఖాన్‌ నటించిన ‘స్వదేశ్‌’ చిత్రంలో కావేరీ అమ్మగా ఆవిడ ప్రత్యేక గుర్తింపును సంపాదించుకున్నారు. (హీరో శ్రీకాంత్‌ ఇంట విషాదం)

ఈ సినిమా తర్వాత ఆమె చిత్ర రంగానికి దూరంగా ఉంటూ సీరియళ్లలో నటిస్తున్నారు. ఈ క్రమంలో అమృతబల్లాళ్‌ కన్నడ మెగా సీరియల్‌ ‘వర్షిణి’లో నటించారు. అయ్య, కెంపేగౌడ, నమ్మణ్ణ, గేర్‌ కానూని సినిమాలతో పాటు అనేక తెలుగు సినిమాల్లోనూ నటించారు. ఆమె కెంపేగౌడ ప్రశస్తి, కన్నడ అకాడమీ ప్రశస్తి, ఐఫా ప్రశస్తిలను దక్కించుకున్నారు. విష్ణువర్ధన్‌, అంబరీష్‌, ప్రభాకర్‌, దర్శన్‌, సుదీప్‌లు నటించిన సినిమాల్లో నటించారు. కిశోరి బల్లాళ్‌ మృతికి కర్ణాటక చలనచిత్ర మండలి అధ్యక్షుడు జయరాజ్‌తో పాటు అనేక మంది సినీరంగ ప్రముఖులు సంతాపం వ్యక్తం చేశారు.(వేధింపులు తట్టుకోలేకపోయా: హీరోయిన్‌)

(వాట్సాప్‌ సందేశం పంపి చనిపోయిన కన్నడ గాయని)

Read latest Movies News and Telugu News | Follow us on FaceBook, Twitter, Telegram



 

Read also in:
Back to Top