వేధింపులు తట్టుకోలేకపోయా: హీరోయిన్‌ | Kannada Actress Missing Case Mystery Reveals in Karnataka Raichur | Sakshi
Sakshi News home page

తల్లి, మారుతండ్రి వేధింపులు తట్టుకోలేకపోయా

Jan 10 2020 8:18 AM | Updated on Jan 10 2020 8:36 AM

Kannada Actress Missing Case Mystery Reveals in Karnataka Raichur - Sakshi

ఆంజినేయ, విజయలక్ష్మి(ఫైల్‌)

రాయచూరు రూరల్‌(కర్ణాటక): సినీ నిర్మాత నుంచి డబ్బులు తీసుకొని పారిపోయిన ఆరోపణలు ఎదుర్కొంటున్న తుంగభద్ర కన్నడ సినిమా హీరోయిన్‌ విజయలక్ష్మి రాయచూరులో ప్రత్యక్షమయ్యారు. ఆమె భర్త ఆంజినేయతో కలిసి రాయచూరులో ప్రత్యక్షమైంది.  గురువారం సిరవార తాలూకా హళ్లిహొసూరులో విలేకర్లతో ఆమె మాట్లాడారు. తుంగభద్ర సినిమా షూటింగ్‌ సమయంలో సహాయ డైరెక్టర్‌ ఆంజినేయను ప్రేమించానని తెలిపారు. ఆంజినేయ, తాను గంగావతిలో పెళ్లి చేసుకున్నామని తెలిపారు. ఇది నచ్చక తన అవ్వ, అమ్మ విషం తాగి ఆత్మహత్యాయత్నం చేశారని వార్తలు వచ్చాయన్నారు. తన అవ్వ చని పోలేదని, తల్లి సవితా డ్రామాలాడుతోందని ఆమె మండిపడ్డారు. 

వారికి నా సంపాదనే ముఖ్యం
తన తల్లిదండ్రులు విడిపోయి ఆరేళ్లు కావస్తోందన్నారు. తల్లి, పెంచిన తండ్రి పెడుతున్న బాధలు తట్టుకోలేకపోయానన్నారు. తన భర్తను చంపడానికి కూడా వారు కుట్ర చేశారని ఆమె ఆరోపించారు. తాను రాయచూరుకు వస్తున్న సమయంలో తాను ఎవరి వద్ద డబ్బు, బంగారు తీసుకోలేదని, తమ పెద్దలకు డబ్బు సంపాదించి పెట్టాలి తప్ప, తాను పెళ్లి చేసుకోరాదనని వారు కోరుకున్నారని ఆవేదన చెందారు. జిల్లా ఎస్పీ వేదమూర్తిని కలిసి తమకు రక్షణ కల్పించాలని విన్నవించినట్లు ఆమె తెలిపారు. దీంతో ఆమె అదృశ్యం మిస్టరీ వీడినట్లయింది.

Advertisement

Related News By Category

Related News By Tags

Advertisement
 
Advertisement

పోల్

Advertisement