దర్శకుడి బర్త్‌డే సెలబ్రేషన్స్‌లో చిరు, వెంకీ, బాలయ్య | Senior Director Kodandaramireddy Birthday Celebrations | Sakshi
Sakshi News home page

దర్శకుడి బర్త్‌డే సెలబ్రేషన్స్‌లో చిరు, వెంకీ, బాలయ్య

Jul 2 2019 10:38 AM | Updated on Jul 2 2019 10:38 AM

Senior Director Kodandaramireddy Birthday Celebrations - Sakshi

ఒకప్పుడు స్టార్ హీరోలతో వరుస బ్లాక్‌ బస్టర్‌ సినిమాలను అందించిన సీనియర్‌ దర్శకుడు ఎ.కోదండరామిరెడ్డి 70వ పుట్టిన రోజు వేడుకలను కుటుంబ సభ్యులు, సినీ ప్రముఖుల సమక్షంలో ఘనంగా నిర్వహించారు. సోమవారం రాత్రి జరిగిన ఈ కార్యక్రమంలో స్టార్ హీరోలు చిరంజీవి, బాలకృష్ణ, వెంకటేష్‌ లు పాల్గొన్నారు.

వీరితో పాటు రాఘవేంద్రరావు, బి. గోపాల్‌, అల్లు అరవింద్‌, ఎమ్మెస్ రాజు, అశ్వనీదత్, దిల్‌ రాజు,  అనిల్ సుంకర, పరుచూరి వెంకటేశ్వరరావు, సత్యానంద్, డాక్టర్ కె.ఎల్. నారాయణ, చంటి అడ్డాల, ఎస్ గోపాల్‌రెడ్డి, సంగీతదర్శకుడు కోటి, కెమెరామెన్ రవీంద్రబాబు, శ్రీమిత్ర చౌదరి, శ్రీనివాస్ రాజు, కోదండరామిరెడ్డి కుమారులు సునీల్, వైభవ్, ఆయన కుటుంబ సభ్యులు ఈ వేడుకల్లో పాల్గొన్నారు. 

ఒకప్పుడు చిరంజీవి, బాలకృష్ణలతో వరుస బ్లాక్‌ బస్టర్లతో అలరించిన కోదండ రామిరెడ్డి చాలా కాలంగా సినిమాలకు దూరంగా ఉంటున్నారు. ఆయన కుమారుడు వైభవ్.. తెలుగు, తమిళ భాషల్లో నటుడిగా కొనసాగుతున్నారు.

Advertisement

Related News By Category

Related News By Tags

Advertisement
 
Advertisement

పోల్

Advertisement