షారుక్ కొడుకు, ఐశ్వర్య కూతురు కలిసి నటిస్తే! | senior bachchan approves aradhya abram pair on screen | Sakshi
Sakshi News home page

షారుక్ కొడుకు, ఐశ్వర్య కూతురు కలిసి నటిస్తే!

Jan 4 2016 9:51 AM | Updated on Sep 3 2017 3:05 PM

షారుక్ కొడుకు, ఐశ్వర్య కూతురు కలిసి నటిస్తే!

షారుక్ కొడుకు, ఐశ్వర్య కూతురు కలిసి నటిస్తే!

అందాల తార ఐశ్వర్యారాయ్ నోట్లోంచి ఊడి పడినట్లుండే ఆరాధ్యా బచ్చన్ ఇప్పటికే పెద్ద సెలబ్రిటీ అయిపోయింది.

అందాల తార ఐశ్వర్యారాయ్ నోట్లోంచి ఊడి పడినట్లుండే ఆరాధ్యా బచ్చన్ ఇప్పటికే పెద్ద సెలబ్రిటీ అయిపోయింది. గట్టిగా నాలుగేళ్లు ఉన్నాయో లేవో.. అప్పుడే ఆమె వెండితెర ప్రవేశం గురించిన చర్చలు మొదలైపోయాయి. అలాగే.. షారుక్ ఖాన్ కొడుకు అబ్‌రామ్ గురించి కూడా వినిపిస్తున్నాయి. నిజానికి బాలీవుడ్‌లో బాగా సెలబ్రిటీలుగా మారిపోయిన పిల్లలు ఎవరంటే వీళ్లిద్దరే. భవిష్యత్తులో వీళ్లిద్దరూ ఆన్‌స్క్రీన్ మీద మంచి జంట అవుతారని షారుక్ ఇప్పటినుంచే కలలు గంటున్నాడు.

సీనియర్ బచ్చన్ అమితాబ్ కూడా దానికి సై అంటున్నారు. ఇటీవల దిల్‌వాలే సినిమా ప్రమోషన్ సందర్భంగా షారుక్ మాట్లాడుతూ, స్క్రీన్ మీద తాను- కాజోల్ మంచి జంట అని, భవిష్యత్తులో అబ్‌రామ్ - ఆరాధ్య మంచి జంట అవుతారని అన్నాడు. ఈ మాట విని ఆరాధ్య తాత అమితాబ్ బచ్చన్ ఉప్పొంగిపోయారట. నిజంగా షారుక్ ఆ మాట అని ఉంటే ఆయన నోట్లో నెయ్యి, చక్కెర, పాల మీగడ అన్నీ వెయ్యాలని అన్నారు. అంటే, పెద్దాయన కూడా పచ్చజెండా ఊపేశారన్న మాట. వజీర్ సినిమా గురించి నిర్వహించిన విలేకరుల సమావేశంలో ఆయనీ వ్యాఖ్యలు చేశారు.

కొసమెరుపు: ఐశ్వర్యా రాయ్ కూతురు ఆరాధ్యా బచ్చన్ (4) కంటే.. షారుక్ ఖాన్ కొడుకు అబ్‌రామ్ (2) రెండేళ్లు చిన్నవాడు.

Advertisement

Related News By Category

Related News By Tags

Advertisement
 
Advertisement

పోల్

Advertisement