ఎనిమిదేళ్ల బంధానికి ముగింపు

Selena Gomez Wrote A letter To Ex Justin Bieber - Sakshi

ప్రపంచ వ్యాప్తంగా తిరుగులేని క్రేజ్‌ సంపాదించుకున్న పాప్‌ సింగర్‌ జస్టిన్‌ బీబర్‌.. తన కొత్త గర్ల్‌ఫ్రెండ్‌, మోడల్‌ హేలీ బోల్డ్‌విన్‌తో ఇటీవల ఆయన ఎంగేజ్‌మెంట్‌ చేసుకున్న విషయం తెలిసిందే. గత నెల(జూలై)8న వీరి నిశ్చితార్థం జరిగినట్లుగా బీబర్‌, హేలీ తల్లిదండ్రులు ధ్రువీకరించారు. తాజాగా ఈ విషయంపై బీబర్‌ మాజీ గర్ల్‌ఫ్రెండ్‌, పాప్‌ సింగర్‌ సెలీనా గోమెజ్‌ స్పందించారు. బీబర్‌, హేలీలకు శుభాకాంక్షలు తెలుపుతూ భావోద్వేగపూరిత లేఖ రాయడంతోపాటు ‘బాక్‌ టు యు’ అనే కొత్త ఆల్బమ్‌ను రిలీజ్‌ చేసింది. సుమారు ఎనిమిదేళ్ల పాటు కొనసాగిన తమ ప్రేమ బంధానికి ముగింపునిస్తూ, బీబర్‌ కొత్త జీవితానికి నాంది పలకడంతో సెలీనా ఉద్వేగానికి లోనైందని ఆమె సన్నిహితులు తెలిపారు. కానీ తనకెంతో విశాల హృదయం ఉందని, బీబర్‌ ఎక్కడున్నా సంతోషంగా ఉంటే చాలని కోరుకునే స్వభావం ఆమెదని పేర్కొన్నారు.

ఎనిమిదేళ్ల బంధానికి ముగింపు..
జలీనా.. సెలీనా గోమెజ్‌, జస్టిన్‌ బీబర్‌ జంటకు ఫ్యాన్స్‌ పెట్టుకున్న పేరు ఇది. సెలీనా- బీబర్‌ జంట 2010లో తమ ప్రేమ ప్రయాణాన్ని మొదలుపెట్టారు. ఎన్నోసార్లు లవ్‌, బ్రేకప్‌లతో వార్తల్లో నిలిచిన ఈ జంట 2017 అక్టోబర్‌లో మళ్లీ ప్రేమలో పడినట్లు ప్రకటించారు. దీంతో వీరి అభిమానులు పండుగ చేసుకున్నారు. కానీ బీబర్‌ తన కొత్త గర్ల్‌ఫ్రెండ్‌ హేలీ బోల్డ్‌విన్‌తో ఎంగేజ్‌మెంట్‌ చేసుకోవడంతో అభిమానులతోపాటు సెలీనా కూడా షాక్‌కి గురయ్యారు. కాగా బీబర్‌, హేలీలు త్వరలోనే వివాహ బంధంతో ఒక్కటయ్యేందుకు డెస్టినేషన్‌ వెడ్డింగ్‌ను ప్లాన్‌ చేస్తున్నట్లు తెలుస్తోంది.

Advertisement
Advertisement

*మీరు వ్యక్తం చేసే అభిప్రాయాలను ఎడిటోరియల్ టీమ్ పరిశీలిస్తుంది, *అసంబద్ధమైన, వ్యక్తిగతమైన, కించపరిచే రీతిలో ఉన్న కామెంట్స్ ప్రచురించలేం, *ఫేక్ ఐడీలతో పంపించే కామెంట్స్ తిరస్కరించబడతాయి, *వాస్తవమైన ఈమెయిల్ ఐడీలతో అభిప్రాయాలను వ్యక్తీకరించాలని మనవి

Back to Top