రణబీర్ కాదు... రచ్చబండ! | Secret about Ranbir Kapoor | Sakshi
Sakshi News home page

రణబీర్ కాదు... రచ్చబండ!

Nov 8 2016 11:28 PM | Updated on Apr 3 2019 6:23 PM

రణబీర్ కాదు... రచ్చబండ! - Sakshi

రణబీర్ కాదు... రచ్చబండ!

‘బ్రదరూ! రణబీర్ కపూర్‌తో జర జాగ్రత్త’. బాలీవుడ్ పార్టీల్లో ఇప్పుడిదే కొత్త స్లోగన్ అట.

‘బ్రదరూ! రణబీర్ కపూర్‌తో జర జాగ్రత్త’. బాలీవుడ్ పార్టీల్లో ఇప్పుడిదే కొత్త స్లోగన్ అట. రణబీర్‌కి ఏదైనా సీక్రెట్ చెప్పాలంటే హిందీ సినిమా జనాలు భయపడుతున్నారు. అంతే కాదండోయ్... అతడికి ‘ఆలిండియా రేడియో’ అని ఓ ముద్దు పేరు కూడా పెట్టారు. రణబీర్‌కి ఏదైనా సీక్రెట్ చెబితే రేడియోలో చెప్పినట్టేనట. దాంతో మేటర్ రచ్చబండకు ఎక్కినట్టే అంటున్నారు. బాలీవుడ్‌లో కొందరు రణబీర్‌కి సీక్రెట్ చెప్పడం.. చివరకు, అది అందరికీ తెలియడంతో చిరాకు పడ్డారట. రణబీర్ మాత్రం ఈ ప్రపంచంలో సీక్రెట్ అనేది లేదంటున్నారు.

ఈ రొమాంటిక్ హీరో చెప్పిన వివరణ ఏంటో తెలుసా? ‘‘ఈ ప్రపంచంలో సీక్రెట్ అనేది ఏదీ లేదు. ప్రతి ఒక్కరికీ ఓ స్నేహితుడు ఉంటాడు. వాళ్లిద్దరి మధ్య జరిగిన సంభాషణలను ఆ స్నేహితుడు ఎవరికీ చెప్పడనే నమ్మకం ఉంటుంది. ఆ స్నేహితుడికీ ఓ స్నేహితుడు ఉంటాడు.. అతను కూడా అంతే. ఆ విధంగా సీక్రెట్ అనేది ప్రపంచం మొత్తం చక్కర్లు కొడుతుంది. ఇక, సీక్రెట్ అనేదానికి అర్థం ఎక్కడుంది? నాతో ఎవరైనా సీక్రెట్ చెబితే... నా ఆరోగ్యం పాడవుతుంది. వెంటనే ఎవరో ఒకరితో ఆ సీక్రెట్ చెప్పేసి, నా ఆరోగ్యాన్ని కాపాడేసుకుంటా’’ అన్నారు రణబీర్. భలే వింతగా, నిజమే అనేంతలా ఉంది కదూ!!

Advertisement

Related News By Category

Related News By Tags

Advertisement
 
Advertisement

పోల్

Advertisement